వీడియో: శ‌్రుతి మించిన‌ పాప్ పిశాచం

Update: 2019-05-22 17:13 GMT
కొంద‌రు పుట్టుక‌తోనే క‌ళ‌ల్లో రాణిస్తారు. ఆ కోవ‌కే చెందుతుంది శ్రుతిహాస‌న్. విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ త‌ర‌హాలోనే శ్రుతిలో ఉన్న మ‌ల్టీట్యాలెంట్ ప‌దే ప‌దే బ‌య‌ట‌ప‌డుతూనే ఉంది. ముఖ్యంగా శ్రుతిహాస‌న్ విష‌యంలో త‌న‌లోని క‌థానాయిక‌ను ప్ర‌తిసారీ పాప్ సింగ‌ర్ డామినేట్ చేస్తూనే ఉంది. అందువ‌ల్ల‌నే ఓ వైపు అగ్ర క‌థానాయిక‌గా రాణించినా .. ఆ పొజిషన్ ని లైట్ తీస్కుని తిరిగి గాయ‌నిగా రాణించేందుకు ప్ర‌య‌త్నాలు చేసింది. అప్ప‌ట్లో అమెరికా వెళ్లి త‌న మ్యూజిక్ బ్యాండ్ తో క‌లిసి లైవ్ షోలు ఇచ్చి అద‌ర‌గొట్టింది. విదేశీ ప్రియుడు మైఖేల్ కోర్స‌లేతో క‌లిసి ఓవైపు షికార్లు.. మ‌రోవైపు విదేశీ షోలు అంటూ రెండేళ్లు జ‌ల్సాల‌తోనే గ‌డిచింది.

ఇంత‌కాలం గ‌డిచాక‌.. మైఖేల్ కోర్స‌లే నుంచి విడిపోయాక తిరిగి య‌థావిధిగా త‌న కెరియ‌ర్ ని రీబూట్ చేస్తోంది. ఓవైపు క‌థానాయిక‌గా రీఎంట్రీ సినిమాలో న‌టిస్తూ బిజీగా ఉంది. మ‌రోవైపు పాప్ గాయనిగా త‌న‌ని తాను సాన ప‌డుతోంది. ఎప్పుడు ఎలాంటి అవ‌కాశం వ‌చ్చినా దానిని స‌ద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని సంకేతాలిస్తోంది. పాప్ ప్ర‌పంచ‌పు రారాజుగా వెలిగిపోయిన‌ మైకేల్ జాక్స‌న్ లోని స్వింగును త‌న బాడీలోకి ఇన్ బిల్ట్ చేసుకున్న శ్రుతిహాస‌న్ ఇదిగో ఇలా గానాలాప‌న చేస్తున్న ఓ వీడియోని అభిమానుల కోసం షేర్ చేసింది.

ఈ పాట ఆద్యంతం శ్రుతిలోని ఎన‌ర్జీ లెవల్స్ అభిమానుల‌కు షాక్ నిస్తున్నాయి. శ్రుతిలో ఇంత ట్యాలెంట్ దాగి ఉందా? అని స‌ర్ ప్రైజ్ అయిపోతున్నారంతా. ఒక‌వేళ శ్రుతి హాస‌న్ క‌థానాయిక‌గా ఫెయిలై అటువైపు వెళ్లి ఉంటే లేడీగాగా.. బ్రిట్నీ స్పియ‌ర్స్ తోనే పోటీప‌డేదేమో!! ఈ వీడియోని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసిన నిమిషాల్లోనే జెట్ స్పీడ్ తో అభిమానుల్లోకి దూసుకెళ్లిపోతోంది. దీనికి కామెంట్లు అంతే వేగంగా దూసుకొస్తున్నాయి. వ్వాట్ యాన్ ఎన‌ర్జీ.. వాటే హ‌స్కీ వాయిస్! అంటూ అభిమానులు పొగిడేస్తున్నారు. టౌన్ లో ట్యాలెంటెడ్ బేబి! అంటూ ఓ అభిమాని ఇన్ స్టాలో వ్యాఖ్య‌ను పోస్ట్ చేశారు. రైజింగ్ సింగ‌ర్.. ఐ ఫెల్ ఇన్ ల‌వ్ విత్ యువ‌ర్ వాయిస్! అంటూ ఫ్యాన్స్ నుంచి రిప్ల‌య్ లు వేడెక్కిపోతున్నాయ్. మొత్తానికి శ్రుతికి తొలి అడుగు ప‌డిన‌ట్టే. ఇదే ఊపులో పెద్ద పాప్ గాయ‌ని అవుతుందేమో!  టీనా కీబోర్డ్.. జోసియా మ్యూజిక్ అంటూ ఏవో త‌న రాక్ బ్యాండ్ గురించి చెప్పుకొచ్చింది శ్రుతి.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News