శృతికి అంత సీన్ ఉందంటారా?

Update: 2019-06-05 03:58 GMT
టాలీవుడ్ లోనే కాదు ఏ బాషలో అయినా హీరొయిన్లకు ఓ రేంజ్ స్టార్ డం ఎక్కువ కాలం కొనసాగడం కష్టం. కొత్త నీరు ప్రవహించడం లాగా న్యూ బ్యూటీస్ వచ్చే కొద్ది దర్శక నిర్మాతలకు ఆప్షన్స్ పెరిగి మార్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే ఇది గుర్తించే కొందరు తమ రెమ్యునరేషన్లు తగ్గించుకోవడమో లేదా సీనియర్ హీరోలతో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమో సర్వసాధారణం. అయితే శృతి హాసన్ మాత్రం ఏనుగు ఫార్ములా ఫాలో అవుతాను అంటోంది. అదే బ్రతికినా లేకున్నా ఏనుగు విలువ ఒకటే అంటారు కదా. ఆ తరహలో అన్నమాట.

విషయానికి వస్తే రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో హీరొయిన్ గా శృతి హాసన్ ను తీసుకోవాలని హీరో దర్శకుడి ఆలోచన. గతంలో ఈ కాంబినేషన్ లో వచ్చిన బలుపు సూపర్ హిట్. సెంటిమెంట్ పరంగా కూడా వర్క్ అవుట్ అవుతుందని అలా ప్లాన్ చేశారేమో. అయితే తాజా టాక్ ప్రకారం శృతి హాసన్ ఏకంగా కోటిన్నర పారితోషికం డిమాండ్ చేయడంతో భయపడ్డ నిర్మాత వేరే హీరొయిన్ ను చూడమని గోపీచంద్ కు చెప్పారట. ఇది అధికారికంగా చెప్పిందేమీ కాదు కాని టాక్ అయితే మహా జోరుగా నడుస్తోంది.

కాటమ రాయుడు ఫలితంతో సంబంధం లేకుండా శృతి హాసన్ లో మునుపటి గ్లో తగ్గిందని ప్రేక్షకులు ఆ టైంలోనే అభిప్రాయపడ్డారు. ఆ కారణంగానే తనకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ఏవో వ్యక్తిగత కారణాలు చెప్పి కొంత గ్యాప్ తీసుకుంది. ఇటీవలే విజయ్ సేతుపతి సరసన నటించేందుకు ఓకే చెప్పింది. ఫాం లో ఉండి డిమాండ్ చేయడంలో తప్పు లేదు కాని ఇలా రాక రాక వచ్చిన ఆఫర్ ని రెమ్యునరేషన్ కోసం వదులుకోవడం ఏమిటో అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా రవితేజ పక్కన శృతి జోడి కడుతుందో లేదో ఇంకొద్ది రోజులు ఆగాక క్లారిటీ వస్తుంది


Tags:    

Similar News