శ్రుతిహాస‌న్ జీవితంలో అత్యంత క‌ష్ట‌మైన ప‌నులివే!

Update: 2022-12-04 02:30 GMT
విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ వార‌సురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాస‌న్ కెరీర్ ప‌రంగా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్..కోలీవుడ్  లో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ మ‌ళ్లీ గ‌త వైభ‌వాన్ని అందుకుంటుంది. మాజీ ప్రియుడు మైఖెల్ కోర్స‌లే కార‌ణంగా కొన్నాళ్ల పాటు కెరీర్ ని లైట్ తీసుకున్నా మ‌ళ్లీ ట్రాక్ లోకి వచ్చేసింది.

సినిమాల‌తో పాటు..కొత్త బోయ్ ప్రెండ్ తోనూ ఎంతో స‌న్నిహితంగా ఉంటుంది. థియేట‌ర్ ఆర్టిస్ట్  శంత‌ను హ‌జారికాతో అమ్మ‌డు పీక‌ల్లోతూ ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

మ‌రి తొలి ప్రేమ బెడిసి  కొట్టింది..మలి ప్రేమ‌నైనా వివాహ బంధం వ‌ర‌కూ తీసుకెళ్తుందా?  లేదా?  అన్న‌ది ఇప్పుడే  చెప్ప‌లేం?  కానీ జీవితాన్నిత‌న‌కు న‌చ్చిన విధంగా డిజైన్ చేసుకుని ముందుకెళ్తుంది.

వృత్తి..వ్య‌క్త‌గ‌త జీవితాన్ని త‌న‌కనుగాణంగా మార్చుకుని సంతోషంగా సాగిపోతుంది. ఈ నేప‌థ్యంలో జీవితం గురించి  కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. జీవితంలో అత్యంత క‌ష్ట‌మైన ప‌ని ఏంది? అంటే ఈ విధంగా స్పందించింది.  సినిమాల్లో ఎన్ని దుస్తులు మార్చినా... ఎన్ని పాత్ర‌లు పోషించినా నిజ జీవితంలో మాత్రం మ‌న‌సుకు న‌చ్చిన‌ట్లుగానే జీవిస్తాను.

అంద‌రికీ న‌చ్చేలా బ‌ట్టలు వేసుకోవ‌డం...మాట్లాడ‌టం.. ప్ర‌వ‌ర్తించ‌డం.. ప్ర‌పంచాన్ని ఆవిష్క‌రించ‌డం వంటివి నాకు జీవితంలో అత్యంత క‌ష్ట‌మైన ప‌నులు. ఎదుకంటే మ‌న‌ల్ని ఎదుటవారు ఎలా ఆమోదిస్తారు అన్న‌ది ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతుంది. ఇది చాలా ప్ర‌మాద‌క‌రం. అందుకే అంద‌ర్నీ తృప్తి ప‌ర‌చాలి అనుకోకుండా నీకు న‌చ్చిన విధంగా..మ‌న‌సుకు న‌చ్చిన‌ట్లు  బ్ర‌తికితే సంతోషంగా ఉంటామ‌ని  సెల‌విచ్చింది.

మొత్తానికి శ్రుతి హాసన్ మాత్రం మ‌న‌సుకు న‌చ్చిన విధంగా లైఫ్ ని లీడ్ చేస్తుంది. సొగ‌స‌రి మాట‌ల్ని బ‌ట్టి  ఏ విష‌యంలోనూ రాజీ ప‌డే త‌త్వం కాద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ   సీనియ‌ర్ హీరోలు చిరంజీవి....బాల‌కృష్ణ సినిమాల్లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అబ్బాయిల‌తో పాటు కుమారుల‌తోనూ క‌లిసి న‌టించ‌డం కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌ర్వాత శ్రుతిహాస‌న్ కే ఆ ర‌క‌మైన ఛాన్సులు ద‌క్కాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News