శృతిహాసన్... కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదట్లో ఆమె నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా పరాజయం చెందడంతో ఐరన్ లెగ్‌గా పేరు పొందింది. అయితే పవన్‌కల్యాణ్ ‘గబ్బర్‌సింగ్’ సినిమా తర్వాత ఆమె దశా, దిశా రెండూ మారాయి. వరుస విజయాలు అందుకుని, స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
అయితే కొన్నాళ్లుగా శృతిహాసన్ కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. తనకి లక్ ఇచ్చిన పవన్ కల్యాణ్ సరసన నటించిన ‘కాటమరాయుడు సినిమానే ఆమె చివరి సినిమా. ఆ తర్వాత ఆమె ‘బెహిన్ హోగీ తేరా!’ అనే బాలీవుడ్ చిత్రంలో మాత్రమే కనిపించింది. తెలుగులో కొత్త సినిమాలు ఎందుకు ఒప్పుకోవట్లేదు అని అడిగితే... ‘నాకు సినిమాలు తప్ప మరేం పని ఉండదా?’ అంటూ దురుసుగా సమాధానం చెప్పింది శృతిహాసన్. అయితే అమ్మడు తన బాయ్‌ఫ్రెండ్ మైకేల్‌తో తిరుగుతూ చాలా చోట్ల మీడియాకి చిక్కింది. దాంతో శృతిహాసన్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా బలుపు సినిమా సమయంలో తీసుకున్న ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేసింది శృతి. ఆ ఫోటో కింద ‘5 ఏళ్ల కిందటి అతిపెద్ద డిస్కో బాల్ జ్ఞాపకాలు...’ అంటూ కామెంట్ చేసింది.
ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ ఫోటో పెట్టడం వెనక ఆంతర్యం ఏమిటా అని సినిమా జనాలు గుసగుసలాడుకుంటున్నారు. తాను తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధమే కానీ అవకాశాలు రావట్లేదనే విషయాన్ని ఇలా చెబుతోందని అనుకుంటున్నారు శృతి అభిమానులు.