ప్రతీ వారికి తమ దైనందిన జీవితంలో రకరకాల అలవాట్లు ఉంటాయి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్లీ రాత్రికి పక్క మీదకు చేరేవరకూ కొన్ని విషయాల్లో నిర్దిష్టమైన పనులు చేస్తుంటారు. సౌత్ బ్యూటీ శృతి హాసన్ నిద్రించే ముందు ఓ పని తప్పనిసరిగా చేస్తుందట.. అలా చేయకపోతే అసలు నిద్దరే రాదట.
శృతి హాసన్ కు తండ్రి కమల్ హాసన్ చిన్నపుడే ఓ విషయం నేర్పించారట. అదేమంటే.. ఏ రోజైనా సరే ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రించలేకపోతే.. ఆ రోజున మనసుకు నచ్చని పని ఏదో చేసి ఉంటామని అర్ధం చేసుకోవాలని చెప్పారట కమల్. తన జీవితంలో ఈ మాటను మరచిపోనంటున్న కమల్ కూతురు.. ప్రతీ రోజు నిద్రపోయే ముందు ఆ రోజు చేసిన అన్ని పనులను గుర్తు చేసుకుంటానని చెబుతోంది. తప్పయినా.. ఒప్పయినా.. ఏదైనా సరే అన్ని పనులు గుర్తు చేసుకుంటానని చెప్పిన శృతి హాసన్.. ఏదైనా తప్పు పనులు చేసి ఉంటే మాత్రం వాటిని మళ్లీ జీవితంలో చేయకుండా ఉండాలని నిర్ణయం తీసుకుంటుందట.
అలా చేసిన తర్వాతే తనకు ప్రశాంతంగా నిద్ర పడుతుందని.. ప్రతీ రోజు నిద్రించే ముందు ఆ రోజు మొత్తాన్ని రీకాల్ చేసుకోకపోతే ఏదో వెలితిగా ఉంటుందని అంటోంది. చెడు గుర్తు తెచ్చుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ దీన్ని కూడా గుర్తు చేసుకుని మళ్లీ చేయనంటున్న శృతి అలవాటు బాగుంది కదూ.