మెగా కాంపౌండ్ పై విసుర్లు.. వివ‌ర‌ణ ఇచ్చిన శ్రుతి!

Update: 2023-04-14 09:51 GMT
టాలీవుడ్ కోలీవుడ్ లో రాణిస్తూనే బాలీవుడ్ లోను న‌టిస్తోంది శ్రుతిహాస‌న్. మూడు ప‌రిశ్ర‌మ‌ల్లో కెరీర్ ప‌రంగా ఉత్త‌మ అవ‌కాశాలు ద‌క్కింది తెలుగు చిత్ర‌ సీమ‌లోనే. ది బెస్ట్ అని చెప్పు కోద‌గ్గ చిత్రాల్లో న‌టించింది. ముఖ్యంగా త‌న‌కు 'గ‌బ్బ‌ర్ సింగ్' రూపంలో తొలి బిగ్ బ్రేక్ నిచ్చింది తెలుగు ప‌రిశ్ర‌మే. దాంతో ఈ ఇండ‌స్ట్రీని శ్రుతి ఎప్పుడూ సెంటిమెంటుగా భావించి గౌర‌విస్తుంది. అలాగే తెలుగు స్టార్ల స‌ర‌స‌న న‌టించ‌డానికి ఎప్పుడూ భేష‌జం ప్ర‌ద‌ర్శించ‌దు.

ఇటీవ‌లే ఓ మెట్టు దిగి వ‌చ్చి సీనియ‌ర్ స్టార్లు చిరంజీవి- బాల‌కృష్ణ స‌ర‌స‌న కూడా న‌టించేసింది. టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌ కు హీరోయిన్లు దొర‌క్క ఇబ్బందిక‌రంగా మారింద‌ని ప్ర‌చార‌మ‌వుతున్న క్ర‌మంలోనే తాను రూల్స్ ని బ్రేక్ చేస్తూ ఇద్ద‌రు అగ్ర హీరోల స‌ర‌స‌న ఒకే సీజ‌న్ లో న‌టించి రెండు (సంక్రాంతి) బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకుంది.

ఇక కెరీర్ ప‌రంగా ఎలాంటి డేరింగ్ డెసిష‌న్స్ తీసుకుంటుందో వ్య‌క్తిగ‌త జీవితంలోను అలాంటి డేరింగ్ స్టెప్స్ తో నిరంత‌రం చ‌ర్చ‌ల్లో నిలుస్తోంది శ్రుతి. తాను ప్రేమించిన విదేశీ ప్రియుడు మైఖేల్ కోర్స‌లేని త‌న తండ్రి క‌మ‌ల్ హాస‌న్ కి ప‌రిచ‌యం చేసింది. ఆ త‌ర్వాత అత‌డితో బ్రేక‌ప్ అనంత‌రం డూడుల్ ఆర్టిస్ట్ శంత‌ను హ‌జారికాతో ప్రేమాయ‌ణం గురించి ఓ పెనైంది. ఇలా త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో ఏదీ దాచుకోని శ్రుతి కొన్నిసార్లు బోల్డ్ ప్ర‌క‌ట‌న‌ల‌తో వివాదాల్లోకి వెళ్లింది.

ఇటీవ‌ల స్టార్ హీరోలతో న‌టించేప్పుడు కొన్ని ఇబ్బందులున్నాయ‌ని మైన‌స్ డిగ్రీల చ‌లిలో మంచు కొండ‌ల్లో ఎలాంటి ఆచ్ఛాద‌నా లేకుండా చ‌లికి ఇబ్బందిపడుతూ డ్యాన్సులు చేయాల్సి వ‌చ్చింద‌ని న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడింది శ్రుతి. అయితే ఇది మెగాభిమానుల‌కు రుచించ‌లేదు. మెగాస్టార్ వాల్తేరు వీర‌య్య కోసం మంచు ప‌ర్వ‌తాల్లో చిత్రీక‌రించిన పాట విష‌య‌మై శ్రుతి ఇలా కామెంట్ చేయ‌డం ఎవ‌రికీ న‌చ్చ‌లేదు. త‌మ బాస్ చిరుని అంత మాట అంటుందా? అంటూ మెగా ఫ్యాన్స్ చిర్రుబుర్రులాడారు. తీవ్రంగా ట్రోలింగ్ చేసారు. అయితే చాలా సంద‌ర్భాల్లో తాను అనాలోచితంగా అలా స‌ర‌దాగా లైట‌ర్ వెయిన్ లో మాట్లాడేస్తాన‌ని దానిని సీరియ‌స్ గా తీసుకోకూడ‌ద‌ని తాజాగా ఈ వివాదం పై శ్రుతి స్పందించింది. త‌న‌ని ట్రోల్ చేసే వారిని చూసి త‌న వ్య‌క్తిత్వాన్ని మార్చుకోలేన‌ని కూడా పంచ్ విసిరింది.

చెన్నైలో అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ సందర్భంగా శ్రుతి ఈ వ్యాఖ్య‌లు చేసింది. సంవత్సరాలుగా మంచులో నటీమణులు డ్యాన్స్ సీక్వెన్స్ ల కోసం ఎలా ఇబ్బందిప‌డుతున్నారో వివ‌రిస్తూ ఇది చాలా సవాల్ లాంటిద‌ని ఇంత‌కుముందు శ్రుతి వ్యాఖ్యానించింది. గతంలో చాలా మంది నటీమణులను  సెంటిమెంట్ పాత్ర‌ల్లో చూపార‌ని అలా నేటి నాయిక‌ల‌ను తెర‌ పై చూపాల‌ని.. మరింత వాస్తవికంగా స్త్రీలను తెర‌ పై చూపించాలని ద‌ర్శ‌క‌నిర్మాతలను అభ్యర్థించింది. అయితే కొన్ని మీడియా వర్గాలు ఈ ప్రకటనల‌ను తప్పుబట్టాయి. కానీ దానిని ప‌ట్టించుకోకుండా త‌న అనుభ‌వాల‌ను ఓపెన్ గా చెబుతాన‌ని ప్ర‌క‌టించింది శ్రుతి.

స‌ర‌దా వ్యాఖ్యానం లేదా తేలిక‌పాటి ఆలోచ‌న‌తో ఒక మాట అనేయ‌డం త‌న‌కు అల‌వాటు అని.. స‌డెన్ గా తన వ్యక్తిత్వాన్ని మార్చలేరని కూడా శ్రుతి అంది. గ‌తంలో వాల్తేరు వీర‌య్య ప్ర‌చార వేదిక‌కు శ్రుతి డుమ్మా కొట్టింది. అయితే అప్ప‌టికి త‌నకు అనారోగ్యంగా ఉండ‌డం వ‌ల్ల రాలేక‌పోయాన‌ని అందుకు చిరుకు సారీ చెబుతున్నాన‌ని కూడా ఓ వీడియో సందేశం పంపింది.  మానసిక ఆరోగ్య సమస్యలతోనే శ్రుతి ఈ ఈవెంట్ కి హాజ‌రు కాలేద‌ని ఒక సెక్ష‌న్ మీడియా రుబాబ్ క్రియేట్ చేయ‌గా దానికి వివ‌ర‌ణ ఇచ్చింది శ్రుతి. త‌న‌కు అనారోగ్యంగా ఉండ‌డం వ‌ల్ల‌నే రాలేక‌పోయాన‌ని శ్రుతి తన సోషల్ మీడియాలో బహిరంగంగా మాట్లాడింది.

ఇక వాల్తేరు వీర‌య్య సినిమా కోసం మైన‌స్ డిగ్రీల చ‌లిలోను శ్రుతి చూపించిన ప్రొఫెష‌నలిజానికి ప్రీరిలీజ్ వేదిక‌పైనే హ్యాట్సాప్ చెప్పారు చిరు. త‌న అందాన్ని పొగ‌డ‌కుండా ఆగ‌లేక‌పోయారు బాస్. ప్ర‌స్తుతం శ్రుతిహాస‌న్ మోస్ట్ అవైటెడ్ స‌లార్ లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న తొలి అవ‌కాశం ద‌క్కించుకున్న ఈ బ్యూటీ యాక్ష‌న్ ప్యాక్డ్ పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం.

Similar News