ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ చిత్రాలకు టికెట్ రేట్లని పెంచుకునే వీలు లేకుండా ప్రభుత్వం జీవో తీసుకురావడం తెలిసిందే. ఇది పెద్ద సినిమాలకు పెను సవాల్‌గా మారింది. అయితే దీనిపై స్పందించడానికి స్టార్ హీరోలు.. ఇండస్ట్రీ పెద్దలు వెనుకాడుతున్న వేళ ఓ స్టార్ హీరోయిన్ అసహనాన్ని వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... ఏపీలో టికెట్ రేట్లని తగ్గించడంపై గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీ వర్గాల్లో వాడీ వేడీ చర్చ జరుగుతోంది.
ఇదిలా వుంటే ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్లు తగ్గించారు కదా .. దీనిపై మీ స్పందన ఏంటని ఓ మీడియా సంస్థ తాజా వివాదంతో ఎలాంటి సంబంధం లేని స్టార్ హీరోయిన్ ని ప్రశ్నించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు హీరోయిన్ ఎదురు ప్రశ్నించి షాకిచ్చింది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు శృతిహాసన్. `క్రాక్` సూపర్ హిట్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన శృతి ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి `సలార్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ లో బిజీగా వున్న శృతిని ఓ మీడియా సంస్థ కలిసి ఏపీలో టికెట్ రేట్లు పెంచడంపై శృతి అభిప్రాయాన్ని కోరింది.
తనకు సంబంధం లేని అంశం గురించి తనని ఎందుకు అడుగుతున్నారని ఓ విధంగా అసహనాన్ని ప్రదర్శించిన శృతి స్మార్ట్‌గా రిప్లై ఇచ్చేసింది. `నేను ప్రొడ్యూసర్ ని కాదు, డిస్ట్రిబ్యూటర్‌ని కాదు.. కాబట్టి ఈ అంశంపై ఏదో ఒకటి చెప్పడం కరెక్ట్ కాదు. ఒకటి మాత్రం చెప్పగలను. కరోనా లాక్‌డౌన్ పరిస్థితుల్లో మనమంతా మన శక్తి మేరకు పని చేస్తున్నాం.
తాజాగా కొత్త వేరియంట్ కూడా వచ్చేసింది. దీంతో మన పోరాటం మరింత పెరిగింది. థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు..ఇండస్ట్రీకి సంబంధించిన వారంతా తమ పరిధిలో పని చేస్తున్నారు` అని సమాధానాన్ని స్మార్ట్‌గా దాటవేయడం చర్చనీయాంశంగా మారింది.