ముంబైలో శ్వేతా బసు కొత్త బంగారులోకం

Update: 2016-07-19 09:33 GMT
కొత్త బంగారు లోకం  హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ఇక్కడ వివాదాలు ఎదుర్కోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. సెక్స్ రాకెట్ లో ఇరుక్కోవడం.. పోలీస్ కేసులు.. స్టేట్ ప్రొటెక్షన్ హోమ్ లో ఉండాల్సి రావడం.. ఆ తర్వాత కేసు కొట్టేయడం లాంటి వాటితో ఇక్కడ ఆమె ఇమేజ్ కు డ్యామేజ్ చాలానే జరిగింది.

ఈ ఎపిసోడ్ తర్వాత శ్వేతాబసు తన మకాం ముంబైకి మార్చేసింది. అక్కడ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కు చెందిన ప్రొడక్షన్ హౌజ్ అయిన ఫాంటమ్ ఫిలిమ్స్ లో స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా జాయిన్ అయి.. జీవితం గడుపుతోంది. ఇది ఆమెకు కొత్త పరిచయాలను కొత్త జీవితాన్ని అందించడం విశేషం. ఫాంటమ్ ఫిలిమ్స్ లోనే తన లైఫ్ పార్ట్నర్ ని వెతుక్కుందీ హీరోయిన్. రోహిత్ మిట్టల్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు సమాచారం.

రోహిత్ అక్కడ షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉంటాడు. ఇప్పుడు తామిద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా.. అందులోనూ ఆ ఫోటోలు అత్యంత సన్నిహితంగా ఉండేవి కావడంతో.. వీరి ప్రేమ బంధాన్ని ప్రపంచానికి ప్రకటించినట్లైంది.
Tags:    

Similar News