శ్యామ్‌ సింగ రాయ్ ఓటీటీ స్ట్రీమింగ్‌ అప్‌డేట్‌

Update: 2021-12-29 17:30 GMT
నాని హీరోగా నటించిన శ్యామ్‌ సింగ రాయ్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విభిన్నమైన కథ మరియు నేపథ్యంతో తెరకెక్కడం తో ప్రేక్షకులు సినిమాను ఆధరిస్తున్నారు. పైగా నాని ద్వి పాత్రాభినయం మరియు సాయి పల్లవి నటన.. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అందం సినిమా కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి అనడంలో అనడంలో సందేహం లేదు. పునః జన్మ ల నేపథ్యం అనగానే కొందరు పెదవి విరిచారు. కాని దర్శకుడు రాహుల్‌ కథను చాలా ఇంట్రెస్టింగ్‌ పాయింట్స్ తో నడిపించి.. పూర్తిగా అసాదరణమైన విషయాన్ని జనాలతో నమ్మించేందుకు చేసిన ప్రయత్నం సఫలం అయ్యిందనే చెప్పాలి. మొత్తానికి శ్యామ్‌ సింగ రాయ్ సినిమా కు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో హీరో నానితో పాటు దర్శకుడు కూడా మరింత స్పీడ్ గా తమ కెరీర్‌ లో దూసుకు వెళ్లబోతున్నారు. ఇక ఈ మద్య కాలంలో విడుదల అయిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమా లు నాలుగు అయిదు వారాలకే ఓటీటీ స్ట్రీమింగ్‌ కు సిద్దం అవుతున్నాయి.

శ్యామ్‌ సింగ రాయ్ ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం వెయిట్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. శ్యామ్‌ సింగ రాయ్ సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేయడం కోసం ఇప్పుడే ప్లాన్‌ ఏమీ లేదట. కాని విశ్వసనీంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ అయిన నెట్‌ ఫ్లిక్స్ వారు ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటికే వారు ఆ విషయాన్ని తెలియజేశారు. అధికారికంగా శ్యామ్‌ సింగ రాయ్ గురించిన విషయాన్ని నెట్‌ ఫ్లిక్స్ వారు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. శ్యామ్‌ సింగ రాయ్ భారీ ఎత్తున అంచనాలు ఉన్న నేపథ్యంలో కొందరు థియేటర్లలో చూడలేని వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

డిసెంబర్‌ 24న ఈ సినిమా విడుదల అయ్యింది కనుక జనవరి చివరి వారం లో లేదా ఫిబ్రవరిలో ఓటీటీ స్ట్రీమింగ్‌ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. శ్యామ్‌ సింగ రాయ్ సినిమా 60 కోట్ల బడ్జెట్‌ తో రూపొంది వసూళ్ల పరంగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు ఓటీటీ మరియు శాటిలైట్‌ రైట్స్ ద్వారా కూడా భారీగానే వసూళ్లు చేసినట్లుగా తెలుస్తోంది. 2021 ఏడాదికి ఒక మంచి ముగింపును నాని శ్యామ్‌ సింగ రాయ్ ఇచ్చినందుకు అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2022 ఎలా ఉంటుందో చూడాలి. నాని నటించిన.. నటిస్తున్న సినిమా లు 2022 లో రెండు లేదా మూడు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Tags:    

Similar News