కేజీఎఫ్ 2 పాన్ ఇండియా.. ఫ‌న్నీ ఏంటీ సిద్దూ!

Update: 2022-05-19 09:30 GMT
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ న‌టించిన మూవీ 'కేజీఎఫ్ 2. ప్ర‌శాంత్ నీల్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. పీరియాడిక్ ఫిక్ష‌న‌ల్ ఫాంట‌సీ క‌థ‌గా తెర‌కెక్కిన ఈ మూవీ అన్ని భాష‌ల్లోనూ భారీ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. క‌న్న‌డ తో పాటు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోనూ ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న'కేజీఎఫ్‌' ఉత్త‌రాదిలోనూ ఇదే హ‌వాని కొన‌సాగిస్తూ వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. హిందీ బెల్ట్ లో మ‌రీ ముఖ్యంగా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ స్టిల్ త‌న హవాని కొన‌సాగిస్తోంది.

ఈ మూవీలో రాఖీభాయ్ య‌ష్ పెర్ఫార్మెన్స్ పై సెల‌బ్రిటీలు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇటీవ‌ల డైరెక్ట‌ర్ శంక‌ర్ కూడా ఈ మూవీపై పొగ‌డ్తలు కురిపించారు. మొత్తానికి కేజీఎఫ్ 2 చూశాన‌ని, క‌టింగ్ ఎడ్జ్ స్టైల్‌, క‌థ‌ని చెప్పిన విధానం, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్‌, బోల్డ్ మూవ్‌.. ఇంట‌ర్ క‌ట్‌..యాక్ష‌న్, డైలాగ్స్ చాలా బ్యూటిఫుల్ గా వ‌ర్క‌వుట్ అయ్యాయి. మాస్ కి ప‌వ‌ర్ హౌస్ గా య‌ష్ ని ప్ర‌జెంట్ చేసిన తీరు బాగా న‌చ్చింది.. మొత్తానికి పెరియ‌ప్ప ఎక్స్ పీరియ‌న్స్ ని అందించారు ప్ర‌శాంత్ నీల్ అంటూ టీమ్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. చాలా మంది సెల‌బ్రిటీలు ఈ మూవీపై ఇదే ఫీలింగ్ ని వ్య‌క్తం చేస్తున్నారు.

కానీ హీరో సిద్ధార్ధ్ మాత్రం  'కేజీఎఫ్ 2' పై  షాకింగ్ కామెట్స్ చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ప్ర‌స్తుతం హిందీలో 'ఎస్కేప్ లైవ్‌' వెబ్ సిరీస్ లో న‌టించారు. త్వ‌ర‌లోనే ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్న సిద్ధార్ధ్ 'కేజీఎఫ్ 2' పై తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో 'పాన్ ఇండియా' కాన్సెప్ట్ పై, సినిమాల‌పై ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

పాన్ ఇండియా విన‌డానికి ఎంతో ఫ‌న్నీగా వుంది. దాదాపు 15 ఏళ్ల నుంచి నేను వివిధ భాష‌ల్లో సినిమాలు చేస్తున్నా. త‌మిళ సినిమాల్లో న‌టిస్తే త‌మిళియ‌న్ గా, టాలీవుడ్ చిత్రాల్లో న‌టిస్తే ప‌క్కా తెలుగింటి అబ్బాయిగా.. ఇలా ఏ భాష‌లో న‌టిస్తే ఆ భాష‌లో నా పాత్ర‌కు నేనే డ‌బ్బింగ్ చెప్పుకొంటున్నాను.

ఇప్ప‌టికీ అదే చేస్తున్నాను. నా పాత్ర‌కు వేరే వాళ్ల చేత డ‌బ్బింగ్ చెప్పించుకోను. నా వ‌రకు ఆయా చిత్రాల‌ను ఇండియ‌న్ ఫిల్మ్స్ అని పిల‌వ‌డ‌మే నాకు ఇష్టం. అలా కాకుండా పాన్ ఇండియా అంటుంటే కాస్త ఇబ్బ‌దిగా వుంది. వేనే ఎవ‌ర్నో ఇబ్బంది పెట్టాల‌ని ఇలా చెప్ప‌డం లేదు.

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో హిందీ చిత్రాల‌కు అత్య‌ధిక ప్రాధాన్య‌త నిచ్చి ఆ భాష నుంచి విడుద‌లైన చిత్రాల‌ను బబాలీవుడ్ చిత్రాల‌నే అంటారు. కానీ ప్రాంతీయ చిత్రాలు విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందితే వాటిని ఎందుకు పాన్ ఇండియా చిత్రాలు అని పిల‌వ‌డం?. భార‌తీయ చిత్రం అని అబివ‌ర్ణించ‌వ‌చ్చు క‌దా?  లేదా కేజీఎఫ్ జ‌ర్నీని గౌర‌వించి క‌న్న‌డ సినిమా అని చెప్పొచ్చు క‌దా?. లేదా అది క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని దృష్టిలో పెట్టుకుని ఇండియ‌న్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. అందుకే ఇలాంటి సినిమాల‌ని పాన్ ఇండియా అని ఇండియ‌న్ ఫిల్మ్ అని చెప్పండి. పాన్ అంటే ఏంటో నాకు అర్థం కావ‌డం లేదు. ఆ ప‌ద‌మే చాలా ఫ‌న్నీగా వుంది' అంటూ వ్య‌గ్యంగా సిద్ధార్ధ్ కామెంట్ లు చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.
Tags:    

Similar News