ప్రియా ప్రకాశ్ వారియర్.....పేరు ఇటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. ``కంటి చూపుతో..... నీ కంటి చూపుతో.....నా మనసు మెల్లగా దోచావే.....``అంటూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కుర్రకారుతో పాటు సెలబ్రిటీలు కూడా పాటలు పాడేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రియాపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించగా....బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ రిషి కపూర్...ఏకంగా తాను సినిమాల్లో నటించేటపుడు ఎందుకు తన సమకాలీనురాలిగా పుట్టలేదంటూ ట్వీట్ చేశాడు. తాజాగా, హీరో సిద్ధార్థ్ కూడా ప్రియాను పొగడ్తలతో ముంచెత్తడంతో పాటు ఆమెకు ఓ విలువైన సలహా కూడా ఇచ్చాడు.
2011 ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తరఫున పాల్ వాల్తాటి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ సీజన్ లో వాల్తాటి 136.98 స్ట్రైక్ రేట్ తో 463 పరుగులు చేశాడు. అయితే, ఆ సీజన్ తర్వాత పేలవమైన ఫామ్ తో మరో రెండు ఐపీఎల్ లకు మాత్రమే పరిమితమయ్యాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ లో ఆడడం లేదు. దీంతో, ఐపీఎల్ లో ఒక సీజన్ లో మాత్రమే అదరగొట్టి, ఆ తర్వాత కనుమరుగైన వాల్తాటితో ప్రియాను పోల్చాడు సిద్ధార్థ్. `కంటిచూపు` వచ్చిన క్రేజ్ `కనుమరుగయ్యేలా` చేసుకోవద్దని, నిలకడగా పర్ ఫార్మ్ చేస్తూ కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకోవాలని హితవు పలుకుతూ ట్వీట్ చేశాడు. "ప్రియా వారియర్ తన హావభావాలతో ఐపీఎల్ లో పాల్ వాల్తాటి అంత సెన్సేషన్ గా మారింది. వాల్తాటిలా ప్రియ ఒక సీజన్ కే పరిమితం కాకూడదు. ఇలాగే తన స్టార్ డమ్, డెలికేట్ బ్యాలెన్స్ ని, స్థిరమైన పెర్ఫార్మెన్స్ ను కొనసాగించాలి. గుడ్ లక్ గర్ల్. వింక్ ఎవే`` అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.