పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల `రిపబ్లిక్` మూవీ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఏపీ మంత్రులని సన్నాసులు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించాయి. అయితే ఆ తరువాత ఎదురుదాడికి దిగిన ఏపీ ప్రభుతం.. మంత్రి పేర్నినాని పవన్ కల్యాణ్ ని అసభ్య పదజాలంతో దూషించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. `ఎవరిది పెట్టుకున్నావ్?` అంటూ రాయడానికి వీలు లేని భాషలో బూతులు తిట్టడం గమనార్హం.
ఆ తరువాత పోసాని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ లు పెట్టి మరీ పవన్ ని అసభ్య పదజాలంతో దూషించడం తెలిసిందే. అయితే తాజా వివాదంపై స్పందించడానికి .. పవన్ కు అంగడగా నిలవడానికి గానీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బ్రదర్ నాగబాబు `కుక్క మొరిగింది అనుకో` అని సరిపెట్టుకోగా.. పవన్ నా దేవర.. దేవుడు.. అంటూ మాట్లాడే బండ్ల గణేష్ కూడా `మా` ఎన్నికల తరువాత స్పందిస్తాననడం విచిత్రంగా వుందంటున్నారు.
ఇక మెగా కాంపౌండ్ కు చెందిన మారుతి.. నిర్మాత బన్నీ వాసు కూడా తాజా ఇష్యూపై స్పందంచడం లేదు. 2017లో టీడీపీ ప్రభుత్వం నంది అవార్డుల విషయంలో మెగా క్యాంప్ కి అన్యాయం జరిగిందని ఓపెన్ గానే సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ ఇద్దరు ఇప్పుడు మాత్రం ఎందుకు సైలెంట్ అయ్యారో ఎవరికీ తెలియడం లేదు. ఇక గతంలో నందమూరి బాలకృష్ణ `మా..ది డిఫరెంట్ బ్లడ్ అంటూ.. చేసిన వ్యాఖ్యలపై నాగబాబు డైరెక్ట్ గానే కౌంటర్ ఇచ్చి పెద్ద రచ్చకు తెరలేపారు. కానీ తన సోదరుడు పవన్ కల్యాణ్ ని వైసీపీ టార్గెట్ చేస్తూ అసభ్య పదజాలంతో దూషిస్తున్నా నాగబాబు.. బండ్ల గణేష్.. మారుతి.. బన్నీ వాసు స్పందించడానికి ముందుకు రావడం లేదు.. సైలెంట్ గా చూస్తున్నారు. తెర వెనుక ఏం జరుగుతోంది?.. ఎందుకని ఈ నలుగురు మౌనం పాటిస్తున్నారు? అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇండస్ట్రీ తరపున దిద్దు బాటు కోసమే!
ఓవైపు వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగే పనిని జనసేనాని పవన్ కల్యాణ్ పెట్టుకున్నా ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఎందుకనో సైలెంట్ గా ఉన్నాయి. దిల్ రాజు-డి సురేష్ బాబు - చిరంజీవి-అల్లు అరవింద్ వంటి దిగ్గజాలు సైతం స్పందించలేదు. పవన్ ఇష్యూలో కానీ ప్రభుత్వంతో ఏ విషయంలోనూ వీరు స్పందించడం లేదు ఎందుకనో.
అయితే దీనంతటికీ కారణం `టిక్కెట్టు`. ఇది జాతకాలు మార్చేస్తోంది. ఇన్నాళ్లు సాగిన బ్లాక్ టికెటింగ్ దందాకు పర్మినెంట్ గా చెక్ పెడుతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అందుకే టికెట్ తంటా ఊహించినంత చిన్నది కానే కాదు. పన్నులు ఎగ్గొడుతున్నారని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది ఇందుకే. ప్రభుత్వమే పోర్టల్ నడిపిస్తే ఇలా ఎగ్గొట్టేందుకు ఛాన్సే లేదనేది ఒక వాదన. దీనిపై ఇంతకుముందు సినీ పెద్దలు ఆ నలుగురికి చిరంజీవి ఒక సినీపెద్ద హోదాలో క్లాస్ తీస్కున్నారని ప్రచారమైంది. టిక్కెట్టు రేటు విషయంలో సినీవర్గాలు మాత్రం గుర్రుమీదున్నాయని సినీపెద్దలకు ఇది రుచించడం లేదని కథనాలొచ్చాయి. కానీ ప్రభుత్వ పోర్టల్ నిర్వహణ అనేది దిల్ రాజుకు కానీ.. ఆ నలుగురికి కానీ ఎలాంటి అభ్యంతరం లేదని తాజాగా తెలుస్తోంది.
ఆన్ లైన్ టికెటింగ్ విధానం కావాలని పరిశ్రమ తరపున మేమే ప్రభుత్వాన్ని కోరామని దిల్ రాజు నిన్నటి రోజున మంత్రి పేర్ని నానీతో సమావేశం అనంతరం అన్నారు. ఆన్ లైన్ విధానం ద్వారా ట్రాన్సరెన్సీ ఉంటుంది అందుకే కోరామని.. ఏపీ మంత్రి పేర్నితో భేటీ అనంతరం మీడియా సమావేశంలో దిల్ రాజు తెలిపారు. దీనిని బట్టి దిల్ రాజుకు దీనిపై ఎలాంటి అభ్యంతరం లేదు. అంటే ఆ నలుగురికి కానీ లేదా ఆ పది మందితో నడుస్తున్న నిర్మాతల గిల్డ్ కి కానీ ప్రభుత్వ పోర్టల్ తో సమస్య లేనట్టేనని భావించాలి.
వైసీపీ వర్సెస్ జనసేనాని వార్ నేపథ్యంలో దిల్ రాజు సహా పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకుని గొడవ సద్ధుమణిగేలా కృషి చేస్తున్నారు. పొలిటికల్ గేమ్ ఇండస్ట్రీని నాశనం చేయకూడదనేది అందరి వాదన. చిరంజీవి- నాగార్జున- రాజమౌళితో కలిసి గతంలోనే సీఎం జగన్ ను మంత్రి నానీని కలిశారు. పరిశ్రమపై కోవిడ్ ప్రభావం.. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వకీల్ సాబ్ సినిమా సమయంలో కొన్ని పరిణామాలు వేగంగా జరిగిపోయినా ఏపీ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగేందుకే నిర్మాతలంతా సిద్ధంగా ఉన్నారు. ఇక పవన్ అలా వ్యాఖ్యానించాల్సింది కాదు అంటూ మెగాస్టార్ చిరంజీవి తనకు ఫోన్ చేశారని ఏపీ మంత్రి పేర్ని నాని అనడం మరో కొసమెరుపు. అంతిమంగా పవన్ ప్రస్తుతానికి ఏకాకి. కానీ ఆయనకు ఆయనే సాటి. అందుకే జనసేనాని అయ్యారని అభిమానుల్లో గుసగుస వినిపిస్తోంది.