మీకు అమ్మ, అక్క, చెల్లి లేరా..?

Update: 2019-01-26 07:15 GMT
వివాదాస్పద సింగర్‌ చిన్మయి మరోసారి వివాదాస్పద కామెంట్స్‌ చేసింది. లైంగిక వేదింపులు ఎదుర్కొంటున్న అమ్మాయిలు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయంను చెబుతుంటే వారినే దోషులుగా జనాలు చూస్తున్నారంటూ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను గతంలో చేసిన మీటూ ఆరోపణల తర్వాత పలు సమస్యలను ఎదుర్కొన్నట్లుగా చెప్పుకొచ్చింది. తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటన్న సమస్యలపై ఆమె స్పందించింది.

ఒక మహిళకు అన్యాయం జరిగి చనిపోయినప్పుడు లేదంటే ఆత్మహత్య చేసుకున్నప్పుడు మాత్రమే ఆమె గురించి జనాలు అయ్యో అంటారు. అప్పుడు కాని ఆమె అన్యాయం గురించి ఆందోళనలు, ఉద్యమాలు చేస్తారు. అదే అన్యాయం జరిగిందని మీడియా ముందుకు వస్తే ఆమె తప్పు చేసినట్లుగా చూస్తారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అవన్ని నేను అనుభవిస్తున్నాను. నన్ను ఇప్పుడు చెడుగా విమర్శలు చేస్తున్న వారందరికి నేను ఒకే ప్రశ్న వేస్తాను.. మీకు అమ్మ, అక్క చెల్లి లేరా? వారిని కూడా ఇలాగే చూస్తారా.

సినిమాల్లో మాత్రం ఆడవారు గొప్ప వారు, ధైర్యంగా ఉండాలని చెప్పే వారు, నిజ జీవితంలో ధైర్యంగా ఉండి, జరిగిన అన్యాయంను చెప్తే మాత్రం అభినందించకుండా అనుమానించడం ఏంటి. లైంగిక వేదింపులు కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా ప్రతి ఒక్క చోట కూడా ఉన్నాయి. చాలా మంది దోషులు తప్పించుకు తిరుగుతున్నారు. నా భర్త ఇచ్చిన సపోర్ట్‌ తో నేను మీటూ ఉద్యమంలో పాల్గొంటున్నాను. ఆయన నాకు ఇచ్చిన ధైర్యం మరువలేనిది. ఆయన్ను ఇతర మగాళ్లు, భర్తలు ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నానంటూ చిన్మయి పేర్కొంది.
Tags:    

Similar News