టాలీవుడ్ సింగర్ సునీత భర్త రామ్ వీరపనేని ఆధ్వర్యంలో మ్యాంగో వీడియోస్ సంస్థ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు - సాంగ్స్ తో అలరించే మ్యాంగో యూట్యూబ్ ఛానల్ తాజాగా వివాదంలో చిక్కుకుంది.
గౌడ మహిళల మనోభావాలు దెబ్బతీసేలా మ్యాంగో యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు ఉన్నాయంటూ ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటివల మ్యాంగో యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలలో గౌడ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించారంటూ గౌడ కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీనగర్ కాలనీలోని మ్యాంగో యూట్యూబ్ ఛానల్ కార్యాలయాన్ని మంగళవారం గౌడ కుల సంఘాలు ముట్టడించాయని తెలుస్తోంది.
గౌడ మహిళలను కించపరిచేలా ఉన్న వీడియోలను మ్యాంగో యూట్యూబ్ ఛానల్ నుంచి వెంటనే తొలగించి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆందోళకారులను పోలీసులు వచ్చి అదుపు చేశారని తెలుస్తోంది. మ్యాంగో వీడియోస్ ఆఫీస్ పై దాడికి సంబంధించిన ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అలానే ఈ వివాదంపై రామ్ మరియు సింగర్ సునీత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.