సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మశ్రీ అవార్డును ప్రకటించిన విషయం తెల్సిందే. తనకు పద్మశ్రీ అవార్డు రావడంతో సంతోషాన్ని పంచుకునేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సిరివెన్నెల పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఆ సందర్బంగానే తెలుగు సినిమాలో పాటలు తగ్గుతున్నాయి. ప్రేక్షకులు పాటలను భారంగా భావిస్తున్నారు కనుక వాటిని తగ్గించుకోవడంలో తప్పులేదు అంటూ నిర్మాతలకు సలహా ఇచ్చారు.
సినిమాలో పాట వచ్చిన ప్రతి సారి కూడా ప్రేక్షకుడు బోర్ గా ఫీల్ అవుతున్న ఈ సమయంలో లక్షలు - కోట్లు పెట్టి పాటలను తీయడం - రాయడం - ట్యూన్ చేయించడం వృదా అనేది ఆయన అభిప్రాయం. అందుకే సినిమాల్లో పాటలు తగ్గించుకుంటే బడ్జెట్ కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ విషయం మరెవ్వరైనా చెప్తే పర్వాలేదు - కాని ఒక ప్రముఖ గేయ రచయిత చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ఎన్నో వందల అద్బుతమైన పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సిరివెన్నెల పాటలపై ప్రేక్షకులకు మోజు పోయిందనే కఠిన వాస్తవంను అంతా ఒప్పుకోవాల్సిందేనన్నాను.
తన సినీ కెరీర్ ఈ స్థాయికి చేరడంలో దర్శకుడు విశ్వనాధ్ గారే కారణం అని - ఆయన సిరివెన్నెల సినిమాలో తనకు అవకాశం ఇవ్వడం వల్లే ఇండస్ట్రీలో అడుగు పెట్టగలిగాను - మొదటి పాటతోనే గుర్తింపు తెచ్చుకున్నానన్నారు. ప్రస్తుతం వస్తున్న పాటలు గుర్తుంచుకోదగ్గవిగా లేవని - అందుకే ప్రేక్షకులు పాటలపై ఆసక్తిని కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు. హాలీవుడ్ సినిమాల తరాహాలోనే ఇండియన్ సినిమాలు కూడా త్వరలోనే పాటలు లేకుండా పోతాయేమో అనే అనుమానంను ఆయన వ్యక్తం చేశారు.