పిక్‌ టాక్ : సీతూ పాప మరోసారి ట్రెండ్డింగ్‌

Update: 2021-07-19 01:30 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కొత్త ఫొటో ఏది బయటకు వచ్చినా వెంటనే సోషల్‌ మీడియాలో కొన్ని లక్షల షేర్‌ లు అవుతాయి. ఎంతో మంది సోషల్ మీడియాలో మహేష్‌ బాబు ఫొటోలను షేర్‌ చేస్తూ తమ అభిమానంను చాటుకుంటారు. హీరోల పిల్లల ఫొటోలను అభిమానులు షేర్‌ చేయడం జరుగుతుంది. కాని ఇతర హీరోల కిడ్స్ తో పోల్చితే మహేష్‌ బాబు కూతురు సితార ఫొటోలు సోషల్‌ మీడియాలో అత్యధికంగా ట్రెండ్‌ అవుతూ ఉంటాయి. సొంతంగా సెలబ్రెటీ హోదాను దక్కించుకునేందుకు సితార ఇప్పటికే సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ మొదలు పెట్టడంతో పాటు ఇన్‌ స్టాలో సందడి చేస్తోంది.

సితార పాప తాజాగా షేర్‌ చేసిన ఈ ఫొటోలు ఎప్పటిలాగే వైరల్‌ అయ్యాయి. కొన్ని లక్షల మంది ఈ ఫొటోలను షేర్ చేశారు. ట్విట్టర్‌.. ఇన్‌ స్టా.. ఇతర సోషల్‌ మీడియా మాధ్యమాల్లో ఎక్కడ చూసినా కూడా సితార పాప కొత్త ఫొటోలు కొత్తవి తెగ కనిపిస్తున్నాయి. పర్పుల్‌ లో సితార పాప ఎంత క్యూట్‌ గా ముద్దుగా ఉందో అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. సితార పాప ఫొటోలను కేవలం మహేష్‌ బాబు అభిమానులు మాత్రమే కాకుండా అందరు కూడా షేర్‌ చేస్తూ ఉంటారు.

ఇక మహేష్‌ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో సినిమా కోసం వేసిన భారీ బ్యాంక్ సెట్ లో షూటింగ్‌ జరుగుతోంది. బ్యాంకింగ్‌ రంగంలో ఉన్న అవినీతి మరియు రాజకీయాల వల్ల ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న నష్టంను సర్కారు వారి పాట సినిమాలో చూపించబోతున్నారట. కీర్తి సురేష్ హీరోయిన్‌ గా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయట.
Tags:    

Similar News