కోవిడ్ మహమ్మారీ ఇంకా దేశాన్ని విడిచిపెట్టి పోలేదు. మరణాల శాతం తగ్గిందే కానీ భయాందోళనలు ఇంకా తగ్గలేదు. కొత్త స్ట్రెయిన్ మరోసారి భయాందోళనకు కారణమవుతోంది. ఇక ఇటీవల చిరంజీవి.. రామ్ చరణ్.. తమన్నా.. రకుల్ ప్రీత్ వంటి స్టార్లు కోవిడ్ భారిన పడిన సంగతి విధితమే. వీరంతా బయటపడగా ప్రస్తుతం రామ్ చరణ్ కి చికిత్స జరుగుతోంది.
ఇక మరోవైపు సెలబ్రిటీలు షూటింగులకు వెళుతున్న వారు .. చుట్టాల్ని పక్కాల్ని కలిసిన వారు కోవిడ్ టెస్టులు ముందస్తుగా చేయించుకుని చెక్ చేసుకుంటున్నారు. అలానే మహేష్- నమ్రతల వారసురాలు సితార ఘట్టమనేని కూడా కోవిడ్ 19 టెస్ట్ చేసుకుంది. ఈ సందర్భంగా తన ఇన్ స్టాలో ఒక నోట్ ని కూడా రాసింది బేబి సితార.
``మొదటిసారి కోవిడ్ టెస్ట్ ... నా వయస్సు పిల్లలందరికీ చిన్న సమాచారం .. పరీక్ష చేయడానికి ముందు నేను చాలా సంశయించాను.. కాని నా పక్కన అమ్మ ఉంది .. నా చేయి పట్టుకొని! మీరు స్నేహితులను కుటుంబ సభ్యులను కలుస్తుంటే పరీక్షలు చేయించుకుని మీరు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకోండి .. నేను అలా చేస్తాను. మీకు నిజం చెప్పాలి ... ఇది అంత చెడ్డది కాదు. కఠినమైనది లేదా బాధాకరమైనది కాదు. కాబట్టి పరీక్షించి సురక్షితమైన సమాజాన్ని ఏర్పాటు చేద్దాం. నూతన సంవత్సర శుభాకాంక్షలు !! ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్.. స్టే సేఫ్`` అని చక్కని సందేశాన్ని సితార జోడించారు. తన పిలుపు మేరకు చిన్న పిల్లలకు ముందస్తుగా టెస్టులు చేయించుకుంటే మంచిదే. తర్వాత అనూహ్యంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.instagram.com/reel/CJaeX38HP6c/?igshid=1rvtyyyu401w