తన శక్తి చూపిస్తానంటున్న శివకార్తికేయన్..

Update: 2020-03-13 10:00 GMT
రెమో సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన తమిళ హీరో శివకార్తికేయన్, ఈ నెల 20న 'శక్తి' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గతేడాది డిసెంబర్ లో 'హీరో' గా రిలీజై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను డబ్ చేసి శక్తిగా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. గతేడాది అభిమన్యుడు సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్న పీఎస్ మిత్రన్ ఈ సినిమాను రూపొందించాడు.

కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా, యాక్షన్ హీరో అర్జున్ ముఖ్య పాత్ర పోషించిన ఈ సినిమా తో బాలీవుడ్ స్టార్ అభయ్ డియోల్ సౌత్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండటం విశేషం. డైరెక్టర్ మిత్రన్ అభిమన్యుడు సినిమాలాగే ఇందులో కూడా సామాజిక అంశాలను మేళవించి కమర్షియల్ సినిమాగా మలిచాడని కోలీవుడ్ కొనియాడుతుంది. ఈ సినిమా తో తెలుగు తెరకు కూడా పరిచయం కానున్నాడు అభయ్ డియోల్.

ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, జార్జ్ సి విల్లియమ్స్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు. సూపర్ మాన్ లా మారాలనుకున్న ఒక విద్యార్ధి ప్రస్తుత విద్యావ్యవస్థ పై ఎలా పోరాడాడు? తన తండ్రి చెప్పిన విధంగా స్థిరపడ్డాడా..? అనే అంశాల చుట్టూ కథ నడుస్తుంది. డైరెక్టర్ శంకర్ తీసిన జెంటిల్ మెన్ సినిమాల మంచి మెస్సేజ్ ఉందని ఇప్పటికే ఈ సినిమా కితాబును అందుకుంది.

మరి తెలుగులో ఏ విధంగా ఆదరిస్తారో.. అభిమన్యుడు లాగానే మంచి హిట్ ను డైరెక్టర్ పీఎస్ మిత్రన్ అందుకుంటాడా? సూపర్ మాన్ గా శివకార్తికేయన్ ను ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే మార్చ్ 20 వరకు ఆగాల్సిందే.
Tags:    

Similar News