వీడియో : పెళ్లి వేడుకలో పవర్ స్టార్, డాన్ ముచ్చట్లు

Update: 2022-06-24 12:52 GMT
సాధారణంగా హీరోల ఫ్యాన్స్ మధ్య పైట్లుంటాయి.. కానీ చాలా వరకు హీరోలు ఫ్రెండ్లీగా ఉంటారు. ముఖ్యంగా యంగ్ హీరోలు ఎలాంటి ఈగో లేకుండా ఒకరి సినిమాలకు మరొకరు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఇరువురి ఫ్యాన్స్ ని ఖుష్ చేస్తుంటారు.

ఎలాంటి అహం లేకుండా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగిపోతుంటారు. అలాంటి వారిలో ముందు ప్లేస్ లో ఉంటారు కోలీవుడ్ కు చెందిన శివకార్తికేయన్.

టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నానికి ఉండే హైపే వేరు. స్టార్ హీరోలతో సమానంగా నానికి ఫ్యాన్స్ ఉంటారు. టాలీవుడ్ నాని లాగే.. కోలీవుడ్ లో శివకార్తికేయన్. తన ప్రతి సినిమా తెలుగులో డబ్ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. ఇటీవల డాన్ సినిమాతో కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లోనూ హిట్ అందుకున్నాడు.

రీసెంట్ గా ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె జాన్వీ వివాహం గురువారం రోజున హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు శివకార్తికేయన్ కూడా హాజరయ్యారు. ఈ వెడ్డింగ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శివకార్తికేయన్ కలిసి ముచ్చటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో శివ కార్తికేయన్ పవర్ స్టార్ ఒకరినొకరు హగ్ చేసుకుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఈ వీడియో చూసిన శివకార్తికేయన్ ఫ్యాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ ఊహించని కాంబో ని చూసి ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇదే వేడుకలో మరికొంత మంది టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సందడి చేశారు. అగ్రకథానాయకులు చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, నాగార్జున, దర్శకులు హరీశ్‌ శంకర్‌, బోయపాటి శ్రీను, ప్రశాంత్‌ వర్మ, అనుదీప్, శేఖర్‌ కమ్ముల, నిర్మాతలు అభిషేక్‌ అగర్వాల్‌, సి.కల్యాణ్‌, నాగవంశీ, సురేశ్‌ బాబు, మిర్యాల రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.


Tags:    

Similar News