సంజుని నమ్మకున్న తెలుగు హీరోయిన్

Update: 2018-06-27 01:30 GMT
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన నేనింతే సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ సియా గౌతమ్. ఆ సినిమా హిట్టు కాకపోవడంతో అమ్మడికి అవకాశాలు ఎక్కువగా రాలేవు. ఆ తరువాత వేదం సినిమాలో ఒక పాత్రలో కనిపించినా ఆ సినిమా కూడా ఆఫర్స్ రావడానికి ఉపయోగపడలేదు. అయితే చాలా మంది పేర్లు మార్చుకొని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని అమ్మడు కూడా పేరు మార్చేసుకుంది.

ఇప్పుడు ఆమె పేరు అదితి గా మారింది. పేరు అలా మార్చుకుందో లేదో అమ్మడు మంచి అఫర్ ను అందుకుంది. అది కూడా బాలీవుడ్ లో సంజయ్ దత్ బయోపిక్ లో అవకాశం దక్కించుకోవడంతో చాలా లక్కీ గర్ల్ అని చెప్పాలి. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంజు సినిమాలో సంజయ్ చెల్లెలు ప్రియాంక దత్ పాత్రలో అదితి కనిపించనుంది. ఆ సినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

అంచనాలు కూడా సినిమాపై చాలానే ఉన్నాయి. అదితి ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలమవుతున్నా కూడా ఇంకా కెరీర్ కు తగ్గట్టుగా ఆఫర్స్ రావడం లేదు. మరి ఈ తెలుగ హీరోయిన్ తలరాతను సంజూ ఎంతవరకు మారుస్తాడో చూడాలి. సంజు సినిమాలో రన్ బీర్ సంజయ్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.   


Tags:    

Similar News