సినిమా ఏదైనా కానీ కేంద్రమంత్రి లాంటి కీలక పదవుల్లో ఉన్నోళ్లు స్పందిస్తారా? అంటే.. నో చెప్పేస్తారు ఎవరైనా. అనుకోని రీతిలో ఏదైనా సినిమా వివాదాస్పదమైతే దాని గురించి మాట్లాడతారు.. అది కూడా రాజకీయ ప్రయోజనం కోసమే. అందుకు భిన్నంగా ఒక కమర్షియల్ మూవీ గురించి ఒక కేంద్రమంత్రి మాట్లాడటం.. ఆ సినిమాకు తమ ఫ్యామిలీ మొత్తం వెళతామని చెప్పటం కాస్త అరుదైన విషయంగా చెప్పాలి. తాజాగా అలాంటి ఆసక్తికరమైన ఉదంతం చోటు చేసుకుంది.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తాజాగా బాలీవుడ్ మూవీ థప్పడ్ పై స్పందించారు. తాప్సీ నటించిన ఈ మూవీ ఇప్పటికే ఆసక్తికర చర్చకు తెర తీసింది. నలుగురు ముందు భార్యపై చెయ్యి ఎత్తినందుకు విడాకులు కోరే మహిళ పాత్రను ఆమె పోషించారు. ఈ చిత్రం గృహహింస ఆధారంగా రూపొందించారు. తాప్సీతో పాటు రామ్ కపూర్.. కుముద్ మిశ్రా తదితరులు నటించిన ఈ చిత్రానికి అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు.
ఈ నెలాఖరు లో విడుదలవుతున్న ఈ సినిమా మీద కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ స్పందిస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. స్త్రీ మీద చేయి ఎత్తటం సరైనది కాదన్న కేంద్రమంత్రి.. అలాంటి పరిస్థితుల్లో ఆమె కూడా ఒక్క చెంపదెబ్బ కొట్టగదన్నారు. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత తనకెంతో ఆనందం కలిగిందన్నారు. ఈ సినిమాను తాను తప్పకుండా చూస్తానని.. అందరూ కటుుంబ సభ్యులతో సహా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చిన్న సినిమాకు స్మృతీ ఇరానీ వ్యాఖ్యలు అనుకోని వరంగా మారాయి. సాక్ష్యాత్తు కేంద్రమంత్రే రంగంలోకి దిగి సినిమాను అందరూ చూడాలని చెప్పటం ఈ సినిమాకు భారీ ప్రచారాన్ని తెచ్చి పెడుతుందనటంలో సందేహం లేదు.