ఫోటో స్టోరి: అందంతో 'స్నేహం' చేయాల్సిందే

Update: 2016-10-05 04:17 GMT
ఓ పదేళ్ల పాటు పక్కింటమ్మాయి పాత్రలతో టాలీవుడ్-కోలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలను అలరించింది స్నేహ. మూడేళ్ల క్రితం పెళ్లి చేసేసుకుని సినిమాల విషయంలో కొంచెం స్లో అయింది కానీ.. ఇప్పటికీ ఈమె ట్యాలెంట్ కి తగిన పాత్రలు వస్తూనే ఉన్నాయి.. వచ్చిన వాటిలో మంచి ఛాన్సులను వదులుకోకుండా చేస్తూనే ఉంది స్నేహ.

ప్రధానంగా అచ్చమైన పక్కింటి ఆడపడుచు లుక్ స్నేహకు పెద్ద అస్సెట్. దీనికి తోడు ఎలాంటి పాత్రనైనా మెప్పించగల ట్యాలెంట్ ఈమె సొంతం. అందుకే ఇప్పటికీ ఈమెకు అవకాశాలు వస్తూనే ఉంటాయి. వీటితో పాటే బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ కూడా. వీటికి తోడు కవర్ పేజ్ లపై ఇప్పటికీ ఎక్కేయగల అందం ఈమె సొంతం. యు అండ్ ఐ అనే మేగజైన్ కవర్ పేజ్ కోసం.. ఇలా మిలమిలా మెరిసిపోతూ పోజులిచ్చింది ఈ సీనియర్ బ్యూటీ. అంత భారీ పట్టుచీర.. మూడు రంగుల్లో కనిపించే డిజైన్.. ట్రెడిషనల్ జ్యూవెల్రీ.. ఇంకెవరైనా అయితే అప్పలమ్మలా ఉండేవారేమో కానీ.. స్నేహ వీటన్నిటినీ ధరించేసరికి అప్సరసలా మెరిసిపోతోందంతే.

ప్రస్తుతం మమ్ముట్టికి  జోడీగా ద గ్రేట్ ఫాదర్ లో నటిస్తున్న స్నేహ.. సీనియర్ హీరోలకు సరిగ్గా సరిపోయే రోల్స్ తో ఆకట్టుకోవడం చూస్తుంటే.. ఈమె కెరీర్ చాలా కాలమే కంటిన్యూ అవడం ఖాయంగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News