అసలు సిసలు హిట్టు ఎలా ఉంటుందో నాగార్జున నిరూపిస్తున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఇప్పటికే బంపర్ హిట్టుని సొంతం చేసుకొంది. సంక్రాంతికి విడుదలైన నాలుగు చిత్రాల్లో నెంబర్ వన్‌గా... బాక్సాఫీసు విన్నర్ గా నిలిచింది.
ఆ చిత్రానికి 13 రోజుల్లో 38 కోట్ల షేర్ దక్కినట్టు సమాచారం. 17 కోట్లలో పూర్తయిన ఆ చిత్రానికి 38కోట్లు రావడమంటే పెట్టిన డబ్బుకి రెండింతలు తిరిగొచ్చినట్టు లెక్క. భారీ కాంపిటీషన్ మధ్య విడుదలైన ఆ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టుకోవడమంటే సంచలనమే అని చెప్పాలి. ఆ లెక్కలు చూసి ట్రేడ్ జనాలు కూడా విస్తుపోతున్నారు. అయితే ఇప్పుడు శాటిలైట్ రైట్స్ రూపంలోనే సోగ్గాడు కుమ్మేశాడు. ఆ చిత్రాన్ని జెమినీ టీవీ సంస్థ 6.50కోట్లకి కొనుగోలు చేసిందని తెలిసింది. దీంతో లాభాల శాతం మరింతగా పెరిగినట్టైంది. నాగార్జున ఎప్పట్నుంచో నష్టపోయిన డబ్బులన్నింటినీ ఒక్క చిత్రంతోనే తిరిగి రాబట్టుకొన్నట్టైంది. ఇప్పుడు నాగార్జున ఫేస్ లో కళ ఉట్టిపడుతోంది. కాన్ఫిడెన్స్ పెరిగింది. అదే ఊపులో తన తనయులకీ విజయాలు దక్కేలా కథల్ని ఎంపిక చేయాలని చూస్తున్నాడాయన. ఇప్పటికీ సుకుమార్ లాంటి అగ్ర దర్శకుల్ని లైన్ లో పెట్టారని తెలుస్తోంది.