సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా మీడియాలో హైలైట్ అవుతూ ఉంటుంది తమిళ నటి సోనా. సినిమాల్లో ఎక్కువగా వ్యాంప్ క్యారెక్టర్లే చేసిన ఈ భామ.. గతంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ తనను వాడుకుని వదిలేశాడంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇలాంటి కొన్ని వివాదాలతో ఆమె పేరు జనాల నోళ్లలో నానింది. ఈ మధ్య ఆమె పెద్దగా వార్తల్లో ఉండట్లేదు. ఐతే లేటెస్టుగా ఒక బోల్డ్ కామెంట్ చేయడం ద్వారా మళ్లీ మీడియా దృష్టిని ఆకర్షించింది సోనా. తాను మద్యం తాగడం మానేశానంటూ ఆమె ఒక ప్రెస్ నోట్ ద్వారా చెప్పడం విశేషం. కొంత కాలంగా ఎక్కడా కనిపించని సోనా.. సినిమాలు మానేసిందని.. ఆమె దురలవాట్లకు బానిస అయి ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్లిపోయిందని వార్తలు వస్తుండటంతో సోనా స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
కొందరు తన గురించి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆ ప్రెస్ నోట్లో సోనా వాపోయింది. తాను సినిమాలు వదిలేశానని.. ఎక్కడికో వెళ్లిపోయానని చేస్తున్న ప్రచారాలన్నీ అబద్ధాలని సోనా స్పష్టం చేసింది. నిజానికి తాను ఎక్కడికీ వెళ్లలేదని, నటనకూ దూరం కాలేదని వివరించింది. ఈ ఏడాది తనకు డజను దాకా సినిమా ఆఫర్లు వచ్చాయని.. వాటిని తాను రిజెక్ట్ చేశానని సోనా చెప్పింది. తాను ఇకపై జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నానని.. డబ్బుల కోసం పరుగులు తీయాల్సిన అవసరం తనకు లేదని చెప్పింది. తాను మద్యపాన అలవాటును వదిలేశానని. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు చాలా పరిపక్వత చెందానని సోనా చెప్పింది. ఈ ఏడాది కొన్ని చిన్న పాత్రలు చేశానని.. కొత్త ఏడాదిిలో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నానని.. ఇకపై తనకంతా మంచే జరుగుతుందని అనుకుంటున్నానని సోనా అంది.