ఆ మూడు నెల‌లు ఎంతో కాంప్లికేటెడ్!- సోనమ్

Update: 2022-08-11 04:27 GMT
సోనమ్ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్.  ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు వీడియోలతో అభిమానులను తరచుగా అప్ డేట్ చేస్తుంది. 2018 వేసవిలో వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను వివాహం చేసుకుంది.

అయితే ఈ జంట ఆరు సంవత్సరాల క్రితం అంటే 2016లో డేటింగ్ ప్రారంభించక ముందే కలుసుకున్నారు. అనంత‌రం సుదీర్ఘ కాలం ప్రేమాయ‌ణం త‌ర్వాత పెళ్లి గురించి తెలిసిందే.

ఈ ఏడాది మార్చిలో సోనమ్ కపూర్ - ఆనంద్ అహుజా తమ మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు ప్రకటించారు. కరణ్ జోహార్ వివాదాస్పద గాసిప్ షో కాఫీ విత్ కరణ్ ఏడవ సీజన్ కు కాబోయే మామ్ సోన‌మ్ త‌న సోద‌రుడు అర్జున్ కపూర్ తో కలిసి వచ్చింది. వారిద్దరూ చాలా రహస్యాలపై బ‌హిరంగంగా మాట్లాడ‌డం అల‌రించింది.

సోనమ్ కపూర్ గర్భవతి. కరణ్ జోహార్ సోనమ్ ప్రెగ్నెన్సీ పైనా ప్ర‌శ్న‌లు అడిగారు.  ఎలా ఉంది? ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అంటూ క‌ర‌ణ్ సోన‌మ్ ని అడిగాడు. మొదటి మూడు నెలలు కఠినంగా ఉండేవని ఆ తర్వాత అద్భుతంగా ఉందని సోనమ్ కపూర్ తనతో చెప్పింది. ``ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది.. నిద్రించడానికి .. కానీ నేను నిజంగా ఆనందిస్తున్నాను`` అని కూడా సోన‌మ్ అన్నారు.

సోనమ్ కపూర్ మరియు ఆనంద్ అహుజా త్వరలో తమ మొద‌టి బిడ్డను ఆశిస్తున్నారు. ఘనంగా క‌పూర్ ఇంట‌ సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కూతురు రాక కోసం ఆ జంట‌తో పాటు అభిమానులు ఓపికగా ఎదురుచూస్తున్నారు.


అర్జున్ కపూర్ విషయానికొస్తే.. అత‌డు ఇటీవ‌ల‌ తన కెరీర్ పై దృష్టి సారించాడు. అత‌డు న‌టించిన‌ ఏక్ విల‌న్ 2 ఇటీవ‌లే విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. లేడీ కిల్లర్ - కుట్టే చిత్రాలలోను అర్జున్ క‌నిపించ‌నున్నాడు. అతను దర్శకత్వం ఆలోచ‌న‌.. ప్రొడక్షన్ లోకి రావడం గురించి కూడా క‌ర‌ణ్ తో చాటింగ్ లో మాట్లాడాడు.
Tags:    

Similar News