బాలీవుడ్ లో ఫెమినిస్టుల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. అక్షయ్ కుమార్ - అనీల్ కపూర్ లాంటి హీరోలు ఆల్వేస్ ఫెమినిస్టులే. దీపిక పదుకొన్ - సోనమ్ కపూర్ - ఆలియాభట్ ఇప్పటికే ఫెమినిస్టులం అని ప్రకటించుకున్నారు. పరిణీతి చోప్రా - కత్రిన కైఫ్ ఫెమినిస్టులు కాలేకపోయినందుకు ఎంతో బాధపడుతున్నాం అని విచారం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ ఫెమినిస్టులందరకీ వత్తాసు పలుకుతూ సోనమ్ కపూర్ ఫెమినిస్టు రాణీగా పాపులర్ అవుతోంది.
హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా, చిన్న చూపు చూసినా అస్సలు వదలొద్దు. చొక్కా కాలర్ పట్టుకుని అడగండి. వసూలు చేయండి అంటూ పిలుపునిచ్చింది సోనమ్ కపూర్. నా వరకూ పారితోషికాల విషయంలో నిక్కచ్ఛిగానే ఉంటాను. నాలో ఎంత సత్తా ఉందో అంత మేరకు అడిగేస్తాను.. అని కుండ బద్ధలు కొట్టినట్టే మాట్లాడింది. పారితోషికం విషయంలో నేను అసంతృప్తిగా లేను కానీ, ఇంకేదో అతీతమైన భావన నన్ను పట్టి కుదిపేస్తుంది అంటూ దీపిక పదుకొన్ అభిప్రాయ పడింది. నిన్నటి రోజున ముంబై మామి ఫిలింఫెస్టివల్‌లో పబ్లిక్ వేదికపై బహిరంగంగా ఈ ముద్దుగుమ్మలంతా తమలోని ఫెమినిజాన్ని బైటికి తీశారు. సోనమ్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో త్వరలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే.