భర్త అంటే ఎవరు? చాలామంది బేలగా 'భరించేవాడు' అనే జెనరల్ డెఫినిషన్ ఇస్తారు. ఇక ఫెమినిస్టులయితే పురుషాధిక్యం గురించి పది జీబీల సమాచారం అవలీలగా ఇచ్చి తర తరాలుగా అణగారిన వారు స్త్రీలు అని మీరు ఒప్పుకునేదాకా నిద్రపోరు. సరే.. ఎవరి లాజిక్కులు వారివి.. ఎవరి సూత్రీకరణ వారిది. మనం ఎవరినీ తప్పు పట్టవలసిన అవసరంలేదు. 'ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి తప్పించుక తిరుగువాడు ధన్యుడు' అని సుమతీ శతకకారుడే చెప్పిన తర్వాత ఈ సోషల్ మీడియా జెనరేషన్ లో మనమెంత?
ఇంతకీ ఈ భర్త టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. బాలీవుడ్ హీరోయిన్ సొనమ్ కపూర్ భర్త ఆనంద్ అహూజా వల్లే. ఆ ఆహూజా గారికేమో భార్య అంటే వల్ల మాలిన ప్రేమ. దీంతో ఆ ప్రేమను ఇలా చాటుకుంటున్నాడు. ఇలా ప్రేమగా తన భార్యను ఉప్పెంచుకొని తన ముచ్చట తీర్చుకున్నాడు. ఇక ఆమె సిగ్గుల మొగ్గై చిరునవ్వులు చిందిస్తూ తన బరువును భరిస్తున్న భర్త గారిని చూసి ముచ్చట పడుతోంది. అలా అని అహూజా భారంగా ఏమీ అనుకోవడం లేదు. ఆ సుకుమారి భారం అయనకు గారంగా ఉంది. సోనమ్ కంటే ఎక్కువగా సంతోషంగా ఉన్నాడు.
ఇక సోనమ్ వాళ్ళ డాడీ కనుక ఈ ఫోటో చూస్తే వెంటనే తన భార్యను సోనమ్-ఆనంద్ జంటకు దిష్టి తీసిరా.. 'జల్దీ జాకే ఆవో' అని హిందీ లో పురమాయిస్తాడేమే. అంతా బాగానే ఉంది.. సోనమ్ ను వాళ్ళాయన ఎత్తుకున్నాడు.. సెలబ్రిటీలు చేశారు కదా అని మీరు ట్రై చేస్తారేమో ముందు మీ ముద్దుల భార్య వెయిట్ చెక్ చేసుకోండి.. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేసేముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మూవ్.. కాదంటే వోలిని స్ప్రే మీ నడుముకు కొట్టుకోవాల్సి వస్తుంది. ఇక పెళ్లి కాని వాళ్ళు ఎవరి పడితే వాళ్ళను ఎలా ఎత్తుకునేందుకు ట్రై చేయకండి.. మొదటికే మోసం వస్తుంది!