సాంగ్ ప్ర‌మో: ఓ బావా అక్క‌ ను స‌క్క‌గ సూస్తావా

Update: 2019-11-15 14:57 GMT
`ప్ర‌తిరోజు పండ‌గే` అంటూ మారుతి అండ్ టీమ్ చేస్తున్న హ‌డావుడి చూస్తుంటే కెరీర్ లో ఓ  మాంచి క్లాసిక్ ని తెర‌కెక్కిస్తున్నాడా? అన్నంత ఇంప్రెష‌న్ కొట్టేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఒక్కో అప్ డేట్ సుప్రీంహీరో సాయిధ‌ర‌మ్ ఫ్యాన్స్ లో ఆస‌క్తిని పెంచుతోంది. మునుప‌టితో పోలిస్తే సాయిధ‌ర‌మ్ ని చాలా క్లాస్ గా ఎలివేట్ చేస్తున్నార‌ని ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్లు రివీల్ చేశాయి.

తాజాగా ఈ సినిమా నుంచి `ఓ బావా.. ` సాంగ్ ప్రోమో రిలీజైంది. థ‌మ‌న్ మార్క్ క్యాచీ ట్యూన్ ఆక‌ట్టుకుంది. ఈ పాట‌లో సాయి తేజ్ క్లాస్ గా సూటు బూటులో ఫారిన్ లొకేష‌న్ లో క‌నిపిస్తున్నాడు. ఇక్క‌డ విలేజీలో మ‌ర‌ద‌లు పిల్ల ఎంతో సిగ్గుప‌డుతూ త‌న‌కోసం ఆత్రంగా వేచి చూస్తుంటే .. చెలి క‌త్తెలు ఓ బావా అంటూ ఆహ్వానిస్తున్నారు. ఓ బావా అక్క‌ ను పెళ్లాడ‌తావా.. స‌క్క‌గ సూస్తావా! అంటూ ఆహ్వానించ‌డం చూస్తుంటే ఈ సినిమా లో బావా మ‌ర‌ద‌ళ్ల మ‌ధ్య రొమాన్స్ ఓ రేంజు లో ఉండ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది.
Full View
27 సెక‌న్ల ప్ర‌మో ప‌చ్చ‌ని ప‌ల్లె ప‌ట్టు అందాల‌ తో మైమ‌రిపించింది. రాశీ చీర‌క‌ట్టులో విలేజ్ గాళ్ లుక్ లో ఆక‌ట్టుకుంది. `సంగీత్ విత్ స్వాగ్` అంటూ ట్యాగ్ లైన్ ని యాడ్ చేశారు కాబ‌ట్టి పెళ్లాడేందుకు వ‌స్తున్న బావగారి కోసం మ‌ర‌దలి ఆత్రం క‌నిపిస్తోంది. ఆరెంజ్ చీర‌లో రాశీ ఛామ్ మైమ‌రిపిస్తోంది. యువ‌ జంట మ‌ధ్య తెర‌నిండుగా రొమాన్స్ బోలెడంత పండ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. జీఏ 2 పిక్చ‌ర్స్- యువి క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 20 డిసెంబ‌ర్ 20న సినిమా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News