ఆమె ఒప్పుకుంటే మాజీ భర్త సినిమాలో నటిస్తా

Update: 2015-07-08 15:30 GMT
సోనియా అగర్వాల్‌.. ఈ పేరును అంత ఈజీగా మరిచిపోలేం. 7/జి బృందావన కాలనీ సినిమాతో అంత బలమైన ముద్ర వేసి ఈ ఉత్తారాది భామ. తమిళంలో ఇంకొన్ని సెన్సేషనల్‌ సినిమాలు చేసి.. ఆ తర్వాత డైరెక్టర్‌ సెల్వ రాఘవన్‌ను పెళ్లి చేసుకుంది సోనియా. కానీ మూడేళ్లు తిరక్కుండానే వాళ్లిద్దరూ విడిపోయారు. సెల్వ.. మరో పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిలైపోగా.. సోనియా మాత్రం ఒంటరిదైపోయింది. హీరోయిన్‌గా కూడా డిమాండు తగ్గిపోవడంతో ఏవో చిన్నా చితకా సినిమాలు చేసుకుంటూ కాలం గడిపేస్తోంది.

ఐతే సెల్వ అవకాశమిస్తే మళ్లీ అతడి దర్శకత్వంలో నటిస్తారా అని సోనియాను అడిగితే.. ''ఆయన సినిమాలో నటించమని ఎవరూ నన్నడగలేదు. సెల్వ రాఘవన్‌ మరో పెళ్లి చేసుకున్నారు. ఆయన చిత్రంలో నటించాలని నాకూ ఆశే. కానీ నేను నటించడం ఆయన భార్య ఇష్టపడాలి. ఆమె ఏ సమస్యా ఉండదని భావిస్తే నేను తప్పకుండా నటిస్తాను'' అని చెప్పింది సోనియా.

ఒకప్పుడు స్టార్‌ హీరోల సరసన నటించి.. ఇప్పుడు కమెడియన్‌ల పక్కన, చిన్నా చితకా చిత్రాల్లో నటిస్తుండటం గురించి మాట్లాడుతూ.. ''నేను ఒకప్పుడు అందాల దేవతగా పేరు తెచ్చుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు సినిమాలు పూర్తిగా మారిపోయాయి. వయసు మీద పడ్డ హీరోయిన్లు రకరకాల పాత్రలు పోషిస్తున్నారు. త్రిష తల్లి పాత్ర కూడా చేసింది. నాకిప్పుడు 33 ఏళ్లు. ఈ వయసుకు తగ్గట్లే కనిపించాలి. ఇంకా పదహారేళ్ల అమ్మాయిగా కనిపించలేను కదా'' అని చెప్పింది సోనియా. తరచుగా పార్టీలకు వెళ్లడంపై వచ్చే విమర్శల గురించి మాట్లాడుతూ.. నా జీవితాన్ని నేను ఎంజాయ్‌ చేస్తున్నా.. ఇందులో ఎవరికేంటి అభ్యంతరం అని ప్రశ్నించింది సోనియా.

Tags:    

Similar News