హాస్పిటల్ విషయం వెల్లడించిన స్టార్ సింగర్

Update: 2019-02-08 11:30 GMT
బాలీవుడ్ సింగర్లలో సోను నిగమ్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.  హిందీ మాత్రమే కాకుండా ఆయన ఎన్నో భాషలలో పాటలు పాడి శ్రోతలను అలరించాడు.  పాటలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడూ కొన్ని సామజిక అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు సోను నిగమ్.  రీసెంట్ గా ఆయన అలర్జీ కారణంగా ఆస్పత్రి చేరవలిసి వచ్చిందట.

ఈ విషయాన్ని సోనూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వివరిస్తూ అలర్జీ కారణంగా పూర్తిగా కన్ను వాచిన ఫోటోను.. హాస్పిటల్లో ఆక్సిజన్ మాస్కును పెట్టిన మరో ఫోటోను షేర్ చేశాడు.  "నా గురించి ఆందోళన పడుతున్నందుకు.. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. నేనిప్పుడు ఒడిషాలో ఒక కాన్సర్ట్ ముగించుకొని ముంబైకి తిరిగి వస్తున్నాను.  కానీ రెండు రోజుల ముందు నా పరిస్థితి ఎలా ఉందో మీతో చెప్పేందుకు నాకేమీ అభ్యంతరం లేదు.  ఇదొక గుణపాఠం లాంటింది. సీ ఫుడ్ పడక పోవడంతో అలర్జీ వచ్చేసింది.  నాకు కన్ను వాచింది.. దగ్గరలో నానావతి హాస్పిటల్ కనుక లేకుంటే ఊపిరి ఆడక నా పరిస్థితి విషమించేది. అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి" అంటూ తనకేం జరిగిందో వివరించాడు.

ఈ విషయం ముందుగా తెలియని వారు సోషల్ మీడియాలో సోనుకు సానుభూతి తెలిపారు.  ఆరోగ్యం విషయంలో ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందేనని అన్నారు.  కొందరు మాత్రం గతంలో సోను చేసిన వివాదాస్పద కామెంట్స్ ను గుర్తు చేస్తూ ఇలాంటి శాస్తి జరగాలని ట్రోల్ చేశారు.  ఈ నెటిజనులు దేన్నీ వదిలేలా లేరు.
Tags:    

Similar News