హీరోయిన్స్‌కు మాత్రమే ఎడ్వాంటేజ్‌

Update: 2015-04-14 23:30 GMT
శ్రీదేవి నుండి తమన్నా వరకు.. జయప్రద నుండి ఇలియానా వరకు.. హేమామాలిని నుండి కాజల్‌ వరకు.. అందరూ సౌత్‌లో మెరిసి, బాలీవుడ్‌లో అడుగుపెట్టిన వారే. కొందరికి ఎక్కువ సినిమాలే వచ్చినా బ్రేక్‌ రాలేదు, కొందరు మాత్రం సూపర్‌స్టార్లు అయిపోయారు. హిందీ తెరను ఏలేశారంతే. కాని మేల్‌ స్టార్స్‌ పరిస్థితి ఏంటి? చిరంజీవి నుండి చరణ్‌ వరకు, రజనీకాంత్‌ నుండి రానా వరకు, నాగార్జున నుండి ధనుష్‌ వరకు.. ఎవ్వరికీ పెద్ద స్టార్‌డమ్‌ ఏమీ లేదు. ఏదో సినిమాలు చేశారంతే. ఇంతకీ ఏం తేడా అంటారు?

ఇకప్పుడు ఒక నానుడి ఉండేది.. బాలీవుడ్‌ బాబుల్లా మనోళ్ళు హ్యాండ్‌సమ్‌గా లేరు కాబట్టే మనం సెట్టవ్వట్లేదని. కాని ఇప్పుడు మాత్రం దాన్ని ఒప్పుకోలేం. అక్కడ నవాజుద్దీన్‌ సిద్దికి, రందీప్‌ హుడా.. తదితరులందరూ పెద్ద అందగాళ్లేం కాదు. వాళ్లకంటే మన హీరోలే చాలా హ్యాండ్‌సమ్‌గా ఉంటారు. కాని మనోళ్ళు అక్కడ క్లిక్కవ్వట్లేదు. ముఖ్యంగా బాష రాకపోవడం ఒక ప్రాబ్లమ్‌ అయితే, ఆ సినిమాలకు కావల్సిన బాడీ లాంగ్వేజ్‌ మెయిన్‌టైన్‌ చేయలేకపోవడం మరో ప్రాబ్లమ్‌. ఏదైమైనా ఆడ లేడీస్‌ హిట్టయినట్లు బాలీవుడ్‌లో మన మగ జెంట్స్‌ పెద్దగా క్లిక్కవేట్లదబ్బా. హీరోయిన్లకు మాత్రం ఎడ్వాంటేజ్‌ కనిపిస్తోంది!!
Tags:    

Similar News