ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండ్డింగ్ హీరోస్ అయిన దేవరకొండ బ్రదర్స్ కలిసి ఇంటర్వ్యూ ఇస్తే ఎలా ఉంటుంది అంటూ అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. త్వరలో ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమాను స్వయంగా విజయ్ దేవరకొండ నిర్మించాడు. దాంతో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను కూడా తానే చూసుకుంటున్నాడు. త్వరలో విడుదల కాబోతున్న పుష్పక విమానం సినిమా కోసం తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి విజయ్ దేవరకొండ గెట్టింగ్ టు నో ది దేవరకొండాస్ అంటూ చిట్ చాట్ జరిపారు. ఈ సందర్బంగా ఇద్దరు చాలా సరదాగా మాట్లాడారు. ఆ విషయాలు.. వివరాలు ఏంటీ అనేది ఇక్కడ చదివేయండి.
** విజయ్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ ప్రైమరీ ఎడ్యుకేషన్ టైమ్ నుంచే హాస్టల్ లో ఉండేవారట. చదువుల్లో ఆనంద్ బెస్ట్, ప్రతి సబ్జెక్ట్ లో 100 కు 100 మార్కులు వచ్చేవి. విజయ్ కు 85 వరకు వచ్చేవట. హాస్టల్ లో ఆనంద్ సైలెంట్ కిడ్ అయితే, విజయ్ గ్యాంగ్ లతో గొడవలు పడే టైప్. తమ్ముడిని ఎవరైనా ఏదైనా అంటే వెంటనే వెళ్లి ఫైటింగ్ చేయడమే. దీంతో విజయ్ అంటే హాస్టల్ హెడ్ మాస్టర్ భయపడేవారట.
** ఇంట్లో ఆనంద్ దేవరకొండను ఎక్కువగా ముద్దు చేసేవారు, విజయ్ ఆట బొమ్మలు అన్నీ ఆనంద్ కే దక్కేవి. క్రికెట్ లో ఆనంద్ ఔట్ అయినా మళ్లీ బ్యాటింగ్ ఛాన్స్ ఇచ్చేవారట. ఇలా తమ్ముడికే ఫస్ట్ ప్రిఫరెన్స్ చూసి విజయ్ కు మండిపోయేదట. కొన్నాళ్లకు ఆనంద్ కు క్రికెట్ మీద ఇష్టం పెరిగి, 100 మార్కులు కాస్త తగ్గుతూ వచ్చాయి.
** విజయ్ దేవరకొండ వాళ్లకు ఒక ఇనిస్టిట్యూట్ ఉండేది. అందులో స్పోకెన్ ఇంగ్లీష్, మోటివేషనల్ క్లాసులు చెప్పేవారు. ఎవరైనా ఫ్యాకల్టీ రానప్పుడు విజయ్ ఆ విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు. అలా చెప్పినందుకు మంచి అమౌంట్ జేబులో పడేదట.
** విజయ్ సినిమా ప్రయత్నాలు చేస్తుంటే, ఆనంద్ ఇంజినీరింగ్ పూర్తి చేసి అమోజాన్ లో ఇంటర్న్ షిప్ చేశారు. అప్పుడే సంపాదించడం మొదలు పెట్టారు. ఇంట్లో ఆనంద్ ఆర్థికంగా హెల్ప్ చేసేవారు. అమెరికాలోని డెలాయిట్ లో ఆనంద్ కు ఉద్యోగం రాగానే ఇంట్లో వాళ్లంతా విజయ్ తో సహా చాలా సంతోషపడ్డారట. ఆనంద్ కు వచ్చిన జాబ్ వల్ల కుటుంబానికి ఆర్థికంగా భరోసా దక్కిందట. యూఎస్ నుంచి రాగానే విజయ్ కు, ఫ్రెండ్స్ తో కలిసి మంచి ట్రీట్ ఇచ్చారట ఆనంద్.
** ఆనంద్ పెళ్లి సరుకు అంటూ నవ్వించారు విజయ్ దేవరకొండ. రిలేషన్ షిప్ లో ఆనంద్ స్టిక్ అయి ఉంటాడని, తను అలా ఉండలేనని, కెరీర్ కోసమే ఆలోచిస్తానని విజయ్ చెప్పారు. విజయ్ కు సినిమాల్లోకి రాకముందు 30-40 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారట.
** ఏ కష్టాన్ని తమ్ముడి దాకా రాకుండా చూశారట విజయ్. అలా తను ఎమోషనల్లీ స్ట్రాంగ్ పర్సన్ అయ్యేందుకు ఆనంద్ రీజన్ అయ్యారని చెప్పుకున్నారు.
** నాన్న బర్త్ డేకు ఆనంద్ టీవీ కొంటే, ఫస్ట్ కారు, ఇళ్లు నేను కొన్నానని విజయ్ చెప్పారు. సినిమాల పట్ల, కెరీర్ పట్ల విజయ్ కమిట్ మెంట్ తనకు బాగా నచ్చుతుందని ఆనంద్ అన్నారు. తమ్ముడికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉందన్న విజయ్...ఆనంద్ చాలా పాటలు కలెక్ట్ చేస్తూ అవి తనకు కూడా పంపిస్తారని చెప్పారు.
** పుష్పక విమానం సినిమా ట్రైలర్ ఈనెల 30న రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తెలిపారు. అలాగే ఇంతగా ఫన్ అండ్ ఎంటర్ టైనింగ్ ట్రైలర్ ను ఇటీవల కాలంలో చూడలేదని విజయ్ అన్నారు. ఆనంద్ కూడా రోలర్ కోస్టర్ రైడ్ లా పుష్పక విమానం సినిమా ఉంటుందని చెప్పారు.