బాండ్ బాదేశాడంటున్న క్రిటిక్స్

Update: 2015-11-20 19:30 GMT
జేమ్స్ బాండ్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు. 007 అంటూ బాండ్ చేసే రచ్చ కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూస్తూ ఉంటారు. సినిమాల్లో హైయెస్ట్ పాపులర్ లాంగెస్ట్ సిరీస్ ఏదైనా ఉందంటే.. అది జేమ్స్ బాండ్ మాత్రమే. ఈ సిరీస్ లో 24వ బాండ్ మూవీగా స్పెక్టర్ ఇప్పుడు రిలీజ్ అయింది. బాండ్ మూవీస్ కి ఉన్న క్రేజ్ కారణంగా విపరీతమైన కలెక్షన్స్ వస్తున్నా... స్పెక్టర్ కు విపరీతమైన నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

ముఖ్యంగా డానయల్ క్రేగ్ కు ఇది నాలుగో జేమ్స్ బాండ్ మూవీ. గతంలో బాండ్ హీరోలతో పోల్చితే, లుక్స్ పరంగా ఇతగాడికి మార్కులు తక్కువే. కానీ చివరగా వచ్చిన స్కైఫాల్ విషయంలో మాత్రం బాగానే ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ సారి మాత్రం బాండ్ లుక్స్ కి - బాగా నెగిటివ్ వచ్చేస్తోంది. ఇప్పటికే క్రేగ్ కు ఇది లాస్ట్ బాండ్ మూవీ అనే రూమర్ ఉంది. దీనికి తోడు సినిమాలో ముద్దులు పెట్టుకోవడంలో తప్ప.. ఆకట్టుకునేలా పెర్ఫామెన్స్  చేయలేదనే విమర్శలు వస్తున్నాయి.

వీటన్నటితోపాటు జేమ్స్ బాండ్ అంటే.. పక్కన ఉండే బాండ్ గాళ్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. స్పెక్టర్ లో కనీసం వాళ్లు కూడా ఆకట్టుకోలేకపోవడం మరింత నిరుత్సాహకర విషయం. కాకపోతే జేమ్స్ బాండ్ సినిమాల్లో ఉండే ఛేజింగులు - కార్ ఫైట్లు - ఎడారిలో ఎపిసోడ్లు - మ్యూజిక్ మాత్రం అదుర్స్ అంటున్నారు. బాండ్ మూవీస్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అయిన స్పెక్టర్ కి.. విమర్శలు మాత్రం బాగానే వస్తున్నాయి.
Tags:    

Similar News