ఎన్టీఆర్ బయోపిక్ మొదలుపెట్టిన ముహూర్త బలం బాలేదేమో కాని ఆది నుంచి అన్ని అపశకునాలే వెంటపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో మంచి టాక్ తెచ్చుకునీ డిజాస్టర్ అయిన మూవీగా ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికీ అర్థం కాని పజిల్ లా మిగిలిపోయింది. ఏకంగా 50 కోట్ల నష్టాలు మిగిల్చి అభిమానులకు సైతం పీడకలగా వెంటాడింది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇంకా మహానాయకుడు బాలన్స్ ఉంది. మొన్నే షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేసారు . పూర్తి చేయాల్సిన సన్నివేషాలతో పాటు ఎన్టీఆర్ టీనేజ్ ఎపిసోడ్స్ ని రీ షూట్ చేసి మమ అనిపించారు.
ఇంతకు ముందు మహానాయకుడు నష్టపోయిన బయ్యర్లకు ఫ్రీగా ఇస్తారనే ప్రచారం గట్టిగా జరిగింది. అయినా కూడా లాస్ పూర్తిగా రికవర్ అయ్యే ఛాన్స్ లేదు. ఎంతో కొంత ఊరట కలుగుతుంది ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూడటం మొదలుపెట్టారు. అయితే బాలయ్య టీం ఏనాడూ అఫీషియల్ గా ఈ మాట అనలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇప్పుడు ఫ్రీగా ఇచ్చే ఆలోచన మానుకున్నారని తెలిసింది.
కథానాయకుడు నష్టంలో ఇరవై శాతం వెనక్కు ఇచ్చి ఇప్పుడీ మహానాయకుడుని కొత్తగా వేరే వాళ్ళకు అమ్ముదామని అనుకుంటున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఒకవేళ అలాంటి చేసినా చూస్తూ చూస్తూ మహానాయకుడుని ఎగబడి కొనేందుకు మార్కెట్ లో బయ్యర్లు అంత సిద్ధంగా లేరు. పైగా ఫ్లోప్ సినిమా సీక్వెల్ అంటే ఎవరికైనా భయమేగా. ఇది అధికారికంగా ప్రకటించింది కాకపోయినా ఇది విన్న కథానాయకుడు కొనుగోలుదారులు అలా ఎలా చేస్తారని సీరియస్ అవుతున్నట్టు వినికిడి.
ఇది ఎప్పుడు తెగుతుందో కాని ముందు మహానాయకుడు ఎప్పుడు విడుదల చేయాలి అనే నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఈ వ్యవహారాలు చక్కదిద్దోచ్చు. అయినా మహానాయకుడు కొత్త వాళ్ళకు ఇవ్వడం ఏమిటో ఫస్ట్ పార్ట్ నష్టాలకు 20 శాతం మాత్రమే ఇస్తామని చెప్పడం ఏమిటో కాస్త బాలయ్య ఈ గోలకు స్వయంగానో లేక ఇతర నిర్మాతల ద్వారాలో వీలైనంత త్వరగా చెక్ పెట్టిస్తే బెటర్