వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్ కంటే ఒక్క రోజు ముందుగా ఇండియాలో!

Update: 2023-05-19 10:26 GMT
సూప‌ర్ హీరో చిత్రాల్లో 'స్పైడ‌ర్ మ్యాన్' క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అందులోనూ ఇండియాలో ఆ సినిమాకి ఉన్న ఫాలోయింగ్ అసాధార‌ణ‌మైంది. మెట్రోపాలిట‌న్  సిటీల్లో స్పైడ‌ర్ మ్యాన్ సినిమా అంటే? వ‌య‌సుతో సంబంధం లేకుండా ఆస్వాదిస్తారు. పెద్ద‌లు సైతం చిన్న పిల్ల‌లు మారిపోతారు.

త్రీడీ గ్లాస్ లో సినిమాని ఆస్వాదించ‌డానికి ఎంతో ఆస‌క్తి చూపిస్తారు. తాజాగా ఇదే సిరీస్ నుంచి రిలీజ్ అవుతోన్న 'స్పైడ‌ర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడ‌ర్ వెర్స్' కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా  ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు.

ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాలు ఆస‌క్తిని రెట్టింపు చేసాయి. అయితే అంద‌రికంటే ముందుగా ఈసినిమా చేసే అవ‌కాశం భార‌తీయుల‌కు ద‌క్క‌డం విశేషం. అవును వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్ కంటే ఒక్క రోజు ముందుగానే భార‌త‌దేశంలో సినిమా రిలీజ్ అవుతుంది.

మ‌న‌దేశంలో జూన్ 1న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్ర‌పంచ దేశాలన్నింకంటే ఈ సినిమాని వీక్షించేది భార‌తీయులు కావ‌డం విశేషం. ఇండియాలో స్పైడ‌ర్ మ్యాన్ మంచి స‌క్సెస్ సాధించింది. స్పైడ‌ర్ మ్యాన్ సిరీస్ లో బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించాయి.

ఆ క్రేజ్ తోనే ఇండియాలోనే సినిమాని ముందుగా రిలీజ్ చేస్తున్నారు. ఇక్క‌డ మ‌రో ర‌క‌మైన మార్కెట్ స్ట్రాట‌జీ కూడా ఉంది.  ఇండియాకంటే ముందే ఇత‌ర దేశాల్లో రిలీజ్ అయి నెగిటివ్ టాక్ వ‌స్తే! ఇండియా లో వ‌సూళ్ల పై ప్ర‌భావం ప‌డుతుంది. ఓపెనింగ్స్ పెద్ద‌గా ఉండ‌వు. ఆ కోణంలో ఈ సినిమాని ముందుగా ఇక్క‌డ రిలీజ్ చేస్తున్నారు. ఆ త‌ర్వాత ఇత‌ర దేశాల్లో రిలీజ్ అయినా టాక్ తో సంబంధం లేకుండా ఆద‌ర‌ణ ద‌క్కుతుంది.

కొన్నేళ్ల‌గా  హాలీవుడ్ సినిమాల‌కు ఇండియాన్ మార్కెట్ అత్యంత కీల‌కంగా మారిన సంగ‌తి తెలిసిందే. బాక్సాఫీస్ వ‌సూళ్ల‌లో భార‌త్ నుంచి వ‌చ్చే వసూళ్లు కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. భార‌త‌దేశంలో సినిమాకి ఉన్న క్రేజ్  ప్ర‌పంచంలో ఏ భాష‌లోనూ లేదు. అందుకే హాలీవుడ్ సినిమాల ముఖ్య‌మైన టార్గెట్ గా భార‌త్  నిలుస్తుంది.

Similar News