మన డిసైడ్‌ చేయడానికి దేవుళ్లం కాదు

Update: 2015-09-27 09:30 GMT
పరిశ్రమలో 30 సంవత్సరాల అనుభవం. లేడీస్‌ టైలర్‌ తో మొదలైన పయనం శివమ్‌ చిత్రం వరకూ దిగ్విజయంగా కెరీర్‌ కొనసాగింది. 30 వసంతాల స్రవంతి మూవీస్‌ గురించి స్టార్‌ ప్రొడ్యూసర్‌ స్రవంతి రవికిషోర్‌ మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర సంగతుల్ని చెప్పుకొచ్చారు.  ఆ విశేషాలు మీకోసం....

=1986లో లేడీస్‌ టైలర్‌ సినిమా  నిర్మించాను. 1987లో పంపిణీ రంగంలోకి ప్రవేశించా. అప్పట్నుంచి సినిమాలు పంపిణీ చేస్తూనే ఉన్నా.

=నేను నిర్మాతగా ఎక్కువ నిలబడ్డానంటే లేడీస్‌ టైలర్‌ వల్లే. కెరీర్‌ లో అప్స్‌ అండ్‌ డౌన్స్‌ వచ్చినా ఎక్కువగా మంచి సినిమాలే తీయగలిగానని నమ్ముతాను. నువ్వు నాకు నచ్చావ్‌ - రెడీ లాంటి సినిమాలు నన్ను నిర్మాతగా నిలబెట్టాయి. ఈ రోజుల్లో చాలా తక్కువమంది నిర్మాతలు మాత్రమే పరిశ్రమలో నిలదొక్కుకోగలుగుతున్నారు. సినిమా తీయడం మన చేతిలో ఉంది. ఆరోజుల్లో రిస్క్‌ ఎక్కువ ఉండేది. అందువల్ల జాగ్రత్తగా ఉండేవాళ్లం. ఒక మంచి ఫేజ్‌ లో నిర్మాతగా కొనసాగడాన్ని గర్వంగా ఫీలవుతున్నా.

=చెడ్డ సినిమాలు చేసి కింది స్థాయికి వెళ్లడం వేరు. మంచి సినిమాలు చేసి స్థాయి పడిపోవడం వేరు. ఎందుకంటే ప్రేమంట రియల్లీ బ్యాడ్‌. అలాగని ప్రేక్షకుల్ని బ్లేమ్‌ చేయలేం. కనెక్ట్‌ కాని పాయింట్‌ ఏదో చెప్పానేమో.. అందుకే ఆడలేదు. అప్పట్లో అమీర్‌ ఖాన్‌ తలాష్‌ సినిమా అలాంటి కాన్సెప్టుతోనే వచ్చింది. అక్కడ ఆడినా మనకి ఆడలేదు.

=నాటి రోజుల్లో నిర్మాతల కమిట్‌ మెంట్‌ వేరు. సినిమా అంటే భక్తితో గుడికెళ్లినట్టు భావించేవారు. ఇప్పుడలా చేయడం లేదు. హెడ్స్‌ తోనే చేస్తున్నారు. హార్ట్‌ తో చేయడం లేదు. ఈరోజుల్లో వస్తున్న సినిమాల్లో కథని కామెడీ డామినేట్‌ చేస్తోంది. అప్పట్లో కథ ఎక్కువ కామెడీ తక్కువ ఉండేది. కొన్ని సినిమాలు చేసేప్పుడు సందేహాలు ఉంటాయి. కొన్ని సార్లు తెలిసి కూడా పిల్లి పాలు తాగుతున్నట్టే ఉండాలి. కానీ ఈసారి అలాంటి అవసరం రాలేదు.

= సీతారామశాస్త్రి 80 పాటలు రాశారు. పాటల కోసం కసరత్తు చేయడానికి ఎన్ని రోజులు నిద్రపోకుండా గడిపామో.. కలిసి ఎంతో ఆలోచించేవాళ్లం. సినిమాలో కథని పాటతోనే ముందుకు తీసుకెళ్లేందుకు తపించేవాళ్లం. ఈరోజు ఆ అవసరమే లేదు. శాస్త్రిగారు రాసింది బాలేదు. మార్చాలి.. అని ఎవరైనా అంటే బాధపడేవాడిని. అయితే నా సినిమాలకు ఆయన రాసినా .. పాటలు బావున్నా.. అవి ఆడనప్పుడు ప్రయోజనం ఉండేది కాదు. పాటలు బావున్నా.. ఆడనప్పుడు ఉపయోగం ఏంటి? ఈరోజుల్లో లిరిక్‌ ని అర్థం చేసుకునే ఓపిక ఎవరికీ లేదు. చూద్దాం కాలమే ఇందులో మార్పు తెస్తుందేమో!

=రఘువరన్‌ బిటెక్‌ నచ్చి రీమేక్‌ - డబ్బింగ్‌ హక్కులు తీసుకున్నా. రామ్‌ తో తీయాలనుకుంటే .. వద్దు దీన్ని డబ్‌ చేసి రిలీజ్‌ చెయ్‌ మని అన్నాడు. ఎందుకంటే ధనుష్ బాగా చేశాడు. ఇక మనం చేయకూడదు అని అనుకుని అదే నాతో  చెప్పాడు. అయితే ఈ సినిమాని డబ్‌ చేసి, పంపిణీదారులకు షో వేస్తే ఒక్కరు కూడా కొనడానికి ముందుకు రాలేదు. ధనుష్ ని ఎవరు చూస్తారు అని కనీసం మాట్లాడకుండా వెళ్లిపోయారు. లక్ష అడ్వాన్స్‌ ఇచ్చేవాళ్లే దొరకలేదు. దాంతో స్వయంగా రిలీజ్‌ చేసుకున్నా. సినిమా పెద్ద హిట్టయ్యింది. ఓపెనింగ్స్‌ బాగా వచ్చాయి. కంటెంట్‌ బావుంటే ఏ సినిమాని అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఆ సినిమా పెద్ద ఉదాహరణ. రజనీ అంత పెద్ద సూపర్‌ స్టార్‌ నటించిన లింగానే ఆడలేదు అంటే అర్థం కావాలి కదా..

=శ్యాంప్రసాద్‌ రెడ్డి - పోకూరి బాబూరావు - గోపాల్‌ రెడ్డి .. ఇలా సీనియర్‌ నిర్మాతలంతా సినిమాలు తీయడంలో పోటీపడేవాళ్లం. మంచి వాతావరణంలో సినిమాలు తీసేవాళ్లం. అప్పట్లో ఫెయిల్యూర్స్‌ ఉన్నా.. సక్సెస్‌ శాతం కూడా బాగానే ఉండేది. అల్లు అరవింద్‌ భలే భలే మగాడివోయ్‌ తో హిట్‌ కొట్టి పార్టీ ఇచ్చారు. ఈసారి నువ్వే పార్టీ ఇవ్వాలి.. అని అన్నారు. అదో మంచి కల్చర్‌.

=పరిశ్రమలో ఎవరూ దేవుళ్లు కారు. ఏదీ మనం డిసైడ్‌ చేయలేం. కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. అయినా జర్నీ కొనసాగించాల్సిందే.

= శివమ్‌ సినిమా చక్కని కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌. అన్ని అంశాలు ఉన్న చిత్రమిది. దర్శకుడు శ్రీనివాస్‌ రెడ్డి కొన్నేళ్ల క్రితం కథ చెప్పారు. అప్పట్నుంచి కలిసి కథ గురించి చర్చలు సాగించాం. అప్పట్లోనే రామ్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో సినిమా చేయాలనుకుని కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాం. అప్పటికి శ్రీనివాస్‌ రెడ్డి కథ బాగా వచ్చింది. ఇక చేయాలనుకున్నాం. కానీ రామ్‌ వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల వెయిట్‌ చేయించాల్సి వచ్చింది. రామ్‌ స్క్రిప్టు విన్న తర్వాత దీనిపై 7-8 నెలలు స్క్రిప్టు గురించే పక్కాగా పనిచేశారు. ఇది కమర్షియల్‌ గా మంచి సినిమా అవుతుంది. 2.43 నిమిషాల నిడివితో సినిమా ఉంటుంది. కామెడీ ఉంటుంది. కంటెంట్‌ ఉంటుంది. అయితే ఇంత నిడివి ఉంది తగ్గించండి అంటే ఎందుకు తగ్గించాలి. డ్యూరేషన్‌ సమస్య కాదు. కంటెంట్‌ జనాలకు నచ్చాలంతే. శివమ్‌ చిత్రాన్ని సోషల్‌ మీడియా సహా అన్ని ప్లాట్‌ ఫామ్‌ లపై ప్రమోట్‌ చేస్తున్నాం. రామ్‌ వైజాగ్‌ వెళ్లి ప్రమోషన్‌ చేస్తున్నాడు. గోడ పోస్టర్‌ ఒక్కటే ఈరోజుల్లో ప్రమోషన్‌ కాదు. అన్నిరకాలా చేయాల్సిందే.

=మనం సినిమా తీసినప్పుడు ఎవరైనా ఫలానా సీన్‌ బాలేదు అని చెబితే మనం ఏమీ చేయలేం. అలా అన్న తర్వాత ఇక నిద్రపట్టదు. అందుకే ఏదైనా రిలీజ్‌ చేసేశాకే చూసుకోవాలి. అయినా ఒకప్పుడు వేరు. ఇప్పుడు వేరు. అప్పట్లో పంపిణీదారులు సినిమా చూసి అనుభవంతో కొన్ని సలహాలిచ్చేవారు. కానీ ఇప్పుడు దర్శకుడు గుంభనంగా ఓ గదిలో కూచునే అన్నీ కానిచ్చేస్తున్నారు. చాలా మంది నిర్మాతలకు కథే తెలీదు.

= వేకువఝామున 7గంటలకు షూటింగ్‌ అంటే 6.30కే సెట్‌ లో ఉంటా. ముగింపు టైమ్‌ లో అందరూ వెళ్లాకే నేను వెళతాను. అదీ నా కమిట్‌ మెంట్‌.
Tags:    

Similar News