స్ర‌వంతి.. ఎమోష‌న‌ల్ ఎటాచ్‌ మెంట్‌

Update: 2015-09-26 17:30 GMT
ప్చ్..! క‌థ బావుంది. కంటెంట్ బావుంది. పెద్ద హిట్ కొట్టేస్తాం అనుకున్నాం. కానీ సీన్ రివ‌ర్స‌య్యింది. ఇలాంటిది ఊహించ‌నిది. ఈ ప‌రాజ‌యం క‌నీవినీ ఎరుగ‌నిది. ఇప్ప‌టికీ ఆ సినిమా ఎందుకు ఫెయిలైందో .. అర్థం కావ‌డం లేదు..  రామ్ హీరోగా న‌టించిన ఎందుకంటే ప్రేమంట సినిమాపై స్టార్ ప్రొడ్యూస‌ర్ స్ర‌వంతి ర‌వికిషోర్ ఎమోష‌న్ ఇది. సినిమాని ప్రాణ‌ప్ర‌దంగా ప్రేమించి చేశాం. రామ్ ఎంతో ఎఫ‌ర్ట్ పెట్టి న‌టించాడు. అయినా ఫ‌లితం తారుమారు అవ్వ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయాం... అంటూ కాస్త ఎమోష‌న‌ల్‌ గానే మాట్లాడారు ర‌వికిషోర్‌. అంతేకాదు త‌న జీవితంలో మ‌రో ముఖ్య‌మైన సినిమా గురించి కూడా ఆయ‌న ప్ర‌స్థావించారు.

అయితే ఇది డ‌బ్బింగ్ సినిమా. ధ‌నుష్ హీరోగా న‌టించిన ర‌ఘువ‌ర‌న్ బి.టెక్ గురించి మాట్లాడుతూ.. అస‌లు ఏ స్టార్ హీరో లేడు.. ధ‌నుష్ షేస్ మ‌న టాలీవుడ్‌ లో అంత ఫేమ‌స్ కానేకాదు. కేవ‌లం కంటెంట్ జ‌నాల‌కు క‌నెక్ట‌య్యింది. పెద్ద హిట్ట‌య్యింది. అస‌లు ఈ సినిమాని డ‌బ్బింగ్ చేసి డిస్ర్టిబ్యూట‌ర్లంద‌రికీ షో వేస్తే .. షో చూసిన త‌ర్వాత నాతో ఎవ‌రూ మాట్లాడ‌కుండా వెళ్లిపోయారు. కొనుక్కుంటామ‌ని ల‌క్ష అడ్వాన్స్ అయినా ఇచ్చినోళ్లు లేరు. అందుకే నేనే స్వ‌యంగా రిలీజ్ చేసుకున్నా. కానీ ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అంత ఓపెనింగ్స్ కేవ‌లం సినిమాలో విష‌యం వ‌ల్లే వ‌చ్చాయి.

కాబ‌ట్టి క‌థ‌ని న‌మ్మితే విజ‌యం సాధ్య‌మేన‌ని ఆ సినిమా నిరూపించింది .. అంటూ ర‌వికిషోర్ రెండు క‌ఠోర‌స‌త్యాల్ని ఆవిష్క‌రించారు. అలాగ‌ని తెలుగు ఆడియెన్ అభిరుచిని ఆయ‌న త‌ప్పుప‌ట్ట‌లేదు. మంచి విష‌యం ఉన్న సినిమాకి తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ప‌ట్టంగ‌డ‌తార‌ని పాజిటివ్ కోణంలో విశ్లేషించారు. మ‌రి ఈ రెండు సంద‌ర్భాల్లో త‌ప్పేమిటి? ఒప్పేమిటి? అన్న‌ది కూడా ఆయ‌న తెలుసుకునే ఉండాలి మ‌రి.  ఎందుకంటే ప్రేమంటే గురించి మాట్లాడుతూ ..థియేట‌ర్ వ‌ర‌కూ జ‌నాలు వ‌చ్చి ఉంటే...? అని ఓ మాట అన్నారు. అందులోనే స‌మాధానం దాగుంద‌ని స్ర‌వంతి ఎందుకు గుర్తించ‌రు?

Tags:    

Similar News