యువ హీరోల్లో విభిన్న కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న శ్రీ విష్ణు కథలు కొత్తగా ఎంచుకుంటున్నా సరే ఈమధ్య అతనికి సరైన సక్సెస్ లేక కెరీర్ రిస్క్ లో పడేసుకున్నాడు. నూతన దర్శకులకు అవకాశం ఇస్తూ వస్తున్న శ్రీవిష్ణు కాన్సెప్ట్ బాగుంటే చాలు ఆ డైరెక్టర్ మీద నమ్మకం ఉంచి సినిమాలు చేస్తున్నాడు. అవేమో బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా పరాజయ పాలవుతున్నాయి. అయినా సరే తన పంథా తనదే అన్నట్టుగా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు శ్రీవిష్ణు. ప్రస్తుతం శ్రీ విష్ణు సామజవరగమన సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఓటీటీలో రిలీజైన వివాహ భోజనంబు సినిమాతో ప్రేక్షకులను అలరించిన రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేశారు.
ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. టీజర్ ఇంప్రెసివ్ గా ఉంది. లవ్ స్టోరీ లో తనకు వచ్చిన సమస్య ఎవరికి రాదంటూ హీరో పాత్ర చెప్పడం అలరించింది. అయితే శ్రీ విష్ణు సినిమాల టీజర్, ట్రైలర్లు బాగుంటాయి. టీజర్ లు ఇంప్రెస్ చేస్తే.. ట్రైలర్ లు సినిమాపై ఆసక్తి కలిగిస్తాయి. అదే అంచనాలతో తీరా సినిమా చూస్తే మాత్రం నిరాశ పరుస్తున్నాయి. 2019 లో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమాతో హిట్ అందుకున్న శ్రీవిష్ణు ఆ తర్వాత ఆరు సినిమాలు చేయగా ఒక్కటి హిట్ అందుకోలేదు. బ్రోచేవారెవరురా సినిమా తర్వాత తిప్పరా మీసం, గాలి సంపత్, రాజ రాజ చోర, అర్జున ఫాల్గుణ, భళా తందనాన, అల్లూరి ఇలా వరుస సినిమాలైతే చేశాడు కానీ సినిమాలు హిట్ అందుకోలేదు.
ఈ సినిమాల టీజర్, ట్రైలర్స్ మాత్రం అంచనాలు పెంచాయి. కానీ సినిమాలు మాత్రం తీవ్రంగా నిరుత్సాహ పరిచాయి. మరి తేడా ఎక్కడ జరుగుతుంది అన్నది శ్రీ విష్ణు గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే మాత్రం కెరీర్ దెబ్బ పడినట్టే. ఇక లేటెస్ట్ సామజవరగమన టీజర్ కూడా సింప్లీ సూపర్ అనేలా ఉంది. మరి ఈ సినిమా అయినా అతన్ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అన్నది చూడాలి. శ్రీవిష్ణు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అనిపించినా ఓవరాల్ గా నిర్మాతలకు లాభాలే తెస్తున్నాయని మరో టాక్.
థియేట్రికల్ రిలీజ్ ఎలా ఉన్నా అతను చేసే సినిమాలన్ని లో బడ్జెట్ కాబట్టి డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో బడ్జెట్ కవర్ అవుతుందట. సో థియేట్రికల్ బిజినెస్ కూడా తక్కువ జరుగుతుండటంతో పెద్దగా లాసులు ఏవి రావట్లేదని టాక్. అయితే సినిమా హిట్టైతే మాత్రం ఇంకాస్త లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి శ్రీవిష్ణు సామజవరగమన సినిమాతో అయినా ఫేట్ మారుతుందా లేదా అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.