పవన్ కు శ్రీరెడ్డి కౌంటర్

Update: 2018-07-14 08:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించిన కొన్ని నెలల కిందట శ్రీరెడ్డి అన్న బూతు మాట ఎంత పెద్ద వివాదాన్ని రాజేసిందో తెలిసిందో. అంతకుముందు వరకు శ్రీరెడ్డి మీద కొంచెం సానుభూతి ఉండేది కానీ.. ఆ వ్యాఖ్యతో ఆమెపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆమెకు మీడియాలో వాయిస్ లేకుండా పోయింది. కొన్ని రోజుల పాటు ఆమె సైలెంటుగా ఉండాల్సి వచ్చింది. అలాగని శ్రీరెడ్డి పూర్తిగా సైలెంటేమీ అయిపోలేదు. సోషల్ మీడియా ద్వారా తన వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తోంది. పలువురి మీద సంచలన ఆరోపణలతో ప్రకంపనలు రేపుతోంది. అప్పుడప్పుడూ ఆమె కొన్ని సోషల్ ఇష్యూస్ మీద కూడా స్పందిస్తోంది. తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ కు కౌంటర్ వేయడం విశేషం. అది చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి వ్యవహారానికి సంబంధించి కావడం గమనార్హం.

పవన్ తాజాగా ఒక మీటింగులో మాట్లాడుతూ.. శ్రీజ పెళ్లి వ్యవహారాన్ని కాంగ్రెస్ నాయకులు క్యాష్ చేసుకోవాలని చూశారని.. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని.. 16 ఏళ్ల పాటు అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మాయిని తీసుకొచ్చి ఢిల్లీలో మీడియా ముందు కూర్చోబెట్టి వివాదం రాజేయడానికి ప్రయత్నించడం తమనెంతో బాధ పెట్టిందని అన్నాడు. ఈ విషయమై శ్రీరెడ్డి స్పందిస్తూ.. కాంగ్రెస్ నాయకులు అంతగా ఇబ్బంది పెట్టినపుడు చిరంజీవి అదే పార్టీలో ఎలా చేరారు.. ఇంకా ఆ పార్టీలోనే ఎందుకు కొనసాగుతున్నారు అని శ్రీరెడ్డి పవన్ ను ప్రశ్నించింది. ఆమె వేసింది సరైన ప్రశ్నే. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ను తిట్టి.. రెండేళ్లు తిరక్కుండానే అదే పార్టీలో ప్రజారాజ్యంను కలిపేసి.. ఆ పార్టీ తరఫున మంత్రి కూడా అయిన చిరంజీవి ప్రజల్లో చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. చిరు చర్యలతో ఇప్పుడు పవన్ కూడా కొన్ని విషయాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం.
Tags:    

Similar News