శేఖర్ కమ్ముల అని పేరేమీ పెట్టకుండా ఆయన పేరు ధ్వనించేలా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసింది శ్రీరెడ్డి. ఇలాంటి వ్యాఖ్యల్ని ఇగ్నోర్ చేస్తే పోయేదేమో? కానీ మాట్లాడకుండా సైలెంటుగా ఉంటే జనాలు ఇందులో నిజం ఉందని భ్రమిస్తారేమో అని కమ్ముల కొంచెం ఘాటుగానే స్పందించాడు. క్షమాపణ చెప్పు లేదా లీగల్ యాక్షన్ కు రెడీగా ఉండు అంటూ హెచ్చరించాడు కమ్ముల. దీంతో శ్రీరెడ్డి డౌన్ అవుతుందనుకున్నారు చాలామంది. కానీ ఆమె మాత్రం ఘాటుగానే స్పందించింది.
‘‘నీ పేరు మెన్షన్ చేశానా? లేక నీ సినిమా పేరు మెన్షన్ చేశానా? జైల్లో పెట్టిస్తానంటున్నావు శేఖర్ కమ్ములా ఈ రోజు. చట్ట ప్రకారం వెళ్తావా? వెళ్లు నాకేమైనా భయమా? నువ్వు శేఖర్ కమ్ముల అయితే నాకేంటి? నీ దగ్గర డబ్బులు ఉంటే నాకేంటి?మీరు తప్పు చేయనపుడు సైలెంటుగా ఉండొచ్చు కదా?’’ అని ఆమె పేర్కొంది.
తన దగ్గర చాలా మందికి సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయని.. తాను కూడా లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నానని. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడానికి ప్రయత్నించకండని ఆమె అంది. తన ఫీలింగ్స్ తాను చెప్పుకుంటే కొందరు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారని.. అలాంటివారి తాట తీస్తానని శ్రీరెడ్డి తాజాగా స్పందించింది. తాను అన్యాయానికి గురయ్యానని.. అందుకే తన వాదన గట్టిగా వినిపిస్తున్నానని ఆమె అంది. సినీ పరిశ్రమలో పెద్దలకు ఒకటే చెబుతున్నానని.. తాను ఒంటరి అయినప్పటికీ తనకు కావాల్సినంత ధైర్యం ఉందని.. పోరాటానికి డబ్బులు అవసరం లేదని.. గుండెలో ధైర్యం ఉంటే చాలని ఆమె అంది.