శ్రీరెడ్డి కొత్త టార్గెట్.. రాఘవ లారెన్స్

Update: 2018-07-13 05:50 GMT
టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ గురించి అలుపెరుగని పోరాటం చేసింది శ్రీరెడ్డి. ఇక్కడి ప్రముఖులు చాలామందిపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. చివరగా నేచురల్ స్టార్ నానిని కొన్ని రోజుల పాటు టార్గెట్ చేసి.. అతడి నుంచి నోటీసులు కూడా అందుకుంది. ఐతే ఈ మధ్య ఆమె ఫోకస్ మారినట్లుంది. టాలీవుడ్ ను వదిలేసి కోలీవుడ్ మీద దృష్టిపెట్టిందామె. కోలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ పెద్ద స్థాయిలో ఉందని.. అక్కడి వాళ్ల బాగోతాల్ని బయటపెడతానని హెచ్చరించిన శ్రీరెడ్డి మెల్లగా ఒక్కొక్కరి పేర్లను బయటపెడుతోంది. ఇటీవలే అగ్ర దర్శకుడు మురుగదాస్ ను ఆమె లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన పేరెత్తకుండా పరోక్షంగా ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.. తర్వాత తమిళ హీరో శ్రీకాంత్ మీదా అలిగేషన్స్ చేసింది. ఐదేళ్ల కిందట సెలబ్రెటీ క్రికెట్ లీగ్ సందర్భంగా తనతో ఒక రాత్రి తమిళ హీరో శ్రీకాంత్  స్పెంట్ చేసి .. సినిమా అవకాశం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశాడని ఆమె ఆరోపించింది. తాజాగా శ్రీరెడ్డి.. డ్యాన్స్ మాస్టర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ ను టార్గెట్ చేసింది.

ఒకసారి హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్లో లారెన్స్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు చెప్పింది. అతడి మెడలో రాఘవేంద్రస్వామి లాకెట్.. రుద్రాక్ష చూసి ఏదో అనుకున్నానని.. కానీ అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. నడుం ఇతర శరీర భాగాలు చూపించమన్నాడని తనతో అసభ్యంగా డ్యాన్స్ మూమెంట్స్ కూడా చేశాడని శ్రీరెడ్డి పేర్కొంది. లారెన్స్ తనకు అవకాశం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని.. దీంతో అతడితో తాను కొంత కాలం పాటు ‘ఫ్రెండ్షిప్’లో ఉన్నానని శ్రీరెడ్డి చెప్పింది. ఐతే బెల్లంకొండ సురేష్ ఈ ఎపిసోడ్లో విలన్ అయ్యాడని ఆమె ఆరోపించడం గమనార్హం కోలీవుడ్లో మరిన్ని బాగోతాల్ని బయట పెడతానని హెచ్చరిస్తున్న శ్రీరెడ్డి.. ఇంకా ఎవరి పేర్లు వెల్లడిస్తుందో చూడాలి. ఐతే శ్రీరెడ్డి మాటల్ని కోలీవుడ్ జనాలు ఏమాత్రం పట్టించుకుంటారన్నది సందేహం.
Tags:    

Similar News