ఎక్కువగా చేసినందుకు.. కాలు బెణికింది

Update: 2017-08-23 10:13 GMT
సినిమా హీరోయిన్ అవ్వాలంటే కేవలం గ్లామర్ ఒక్కటే ఉంటే సరిపోదు.. నాజూకుగా కనిపించే ఫిట్ ఫిగరుతో పాటుగా.. చాలా టెలెంట్లు ఉండాలి. అందుకే చాలామంది స్టార్ కిడ్స్ ఇంటర్మీడియట్ పూర్తవ్వడంతోనే ఫారిన్ చెక్కేసి యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటుంటారు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ కూడా న్యూయార్క్ లోని ఒక అకాడమీలో అదే తరహాలో నటనలో శిక్షణ తీసుకుంది. అయితే మన ఇండియన్ సినిమాల్లో రాణించాలంటే నటన ఒక్కటే సరిపోదు. డ్యాన్సులు కూడా రావాలి.

ఆల్రెడీ తన అందచందాలతో తెగ ఊరిస్తున్న శ్రీదేవి పెద్ద కూతురు ఇప్పుడు మంబయ్ లోని ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ వద్ద డ్యాన్సులో శిక్షణ పొందుతోంది. ఈ సమయంలో అమ్మడు తన తల్లి తరహాలో హీరోలతో పోటీపడి డ్యాన్సులు వేయాలనే ధ్యేయంతో.. కాస్త ఎక్కువగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోందట. ఆ దెబ్బకి ఆమె కాలి మోచిప్పకు చిన్న గాయం అయ్యిందని తెలుస్తోంది. ఆమె మోకాలు దగ్గర బెణికిందట. అయినాసరే కాలికి ఒక సేఫ్టీ క్యాప్ పెట్టుకుని మరీ జాన్వి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఈ సాధనంతా ముగించుకుని ముంబాయ్ లో బయట కనిపించిన జాన్విని చూస్తే మాత్రం.. ఆమె కాలుకి కట్టు కట్టుకున్నా కూడా ఎంతో సెక్సీగా ఉంటుందనే చెప్పాలి.

ఇకపోతే జాన్వి డెబ్యూ సినిమా గురించి ఇంకా ఒక క్లారిటీ మాత్రం రాలేదు. అమ్మడు కరణ్‌ జోహార్ నుండి చాలామంది సినిమాల్లో మెరుస్తుందని ఎన్ని రూమర్లు వచ్చినా కూడా.. వాటిల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం కావట్లేదు. చూద్దాం ఆ తొలిసారి తెరమీద తెరంగేట్రం ఎప్పుడు జరుగుతుందో!!
Tags:    

Similar News