కూతురి కోసం అంతగా తపించి..

Update: 2018-02-25 05:34 GMT
తన పెద్ద కూతురు జాన్విని కథానాయికగా పరిచయం చేయడం కోసం శ్రీదేవి ఎంతగా తపించిందో అందరికీ తెలిసిందే. జాన్విని ఐదారేళ్ల కిందట్నుంచే ఆమె హీరోయిన్ చేయడం కోసం ట్రైన్ చేస్తూ వస్తోంది. ఆమె తెరంగేట్రం ఎప్పుడో కన్ఫమ్ అయింది కానీ.. తన తొలి సినిమా ఖరారవ్వడానికే ఆలస్యమైంది. ఎన్నో ప్రపోజల్స్ వచ్చినప్పటికీ పక్కన పెట్టేసిన శ్రీదేవి.. చివరకి మరాఠీ బ్లాక్ బస్టర్ ‘సైరాట్’ రీమేక్‌ ద్వారా ఆమెను పరిచయం చేయడానికి అంగీకరించింది. ముందు నుంచి కూతురికి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తూ.. నటన.. డ్రెస్సింగ్.. లుక్స్.. ఇలా ప్రతి విషయంలోనూ ఆమెను ట్రైన్ చేస్తూ తెరంగేట్రానికి సిద్ధం చేసింది.

అన్నీ కుదిరి కొన్ని నెలల కిందటే జాన్వి తొలి సినిమా ‘ధడక్’ సెట్స్ మీదికి వెళ్లింది. ఈ చిత్రం ఇంకో ఐదు నాలుగు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. సినిమా చిత్రీకరణ కూడా పూర్తయింది. తెర మీద తన కూతురిని చూసి మురిసిపోవాలని ఎదురు చూస్తూ వచ్చిన శ్రీదేవిక ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయింది. దుబాయిలో పెళ్లి కోసం శ్రీదేవి.. ఆమె భర్త బోనీకపూర్.. చిన్న కూతురు కూడా వెళ్లారు కానీ.. జాన్వి మాత్రం ఇక్కడే ఉండిపోయింది. ఆమె ‘ధడక్’ షూటింగ్ లోనే పాల్గొంటోంది. కుటుంబమంతా కలిసి వెళ్తూ కూడా జాన్విని ఇక్కడే వదిలేయడానికి కారణం కూడా ఆమె తెరంగేట్రాన్ని సీరియస్ గా తీసుకోవడమే. ఐతే శ్రీదేవి ఇంతగా ప్లాన్ చేసి కూతురిని కథానాయికగా చేయడం కోసం అంతగా తపించినా.. ఆమె తెరంగేట్రాన్ని చూడకుండానే వెళ్లిపోవడం విచారకరం. ఈ స్థితిలో జాన్వి తన తొలి సినిమాను ఎలా పూర్తి చేస్తుందో.. ఈ సినిమా విడుదల సమయంలో ఆమె ఎలాంటి భావోద్వేగాలకు గురవుతుందో?
Tags:    

Similar News