ఇంతకీ శ్రీదేవి అన్నింటి గురించీ చెబుతోంది అసలు తన కూతురు ఝాన్వి కపూర్ గురంచి వస్తున్న రూమర్లపై స్పందించదేంటి? ఈ మధ్యన ఈవిడ అలాంటి వాటిపై స్పందించడానికి యాప్ ఒకటి పెడుతోంది అంటున్నారు కాని.. శ్రీదేవి మాత్రం అంతకంటే ముందే ఒక రూమర్ పై స్పందించింది. ఈమె పెద్ద కూతురు సినిమాల్లో మెగా బ్రేక్ కోసం ఏకంగా రణబీర్ కపూర్ వెంట పడుతోందని ఒక రూమర్ వినిపిస్తోంది. అందులో ఎంత మాత్రం నిజముంది? దీనిపై శ్రీదేవి స్పందన ఇలా ఉంది.
''ఈ మధ్య నా పెద్ద కూతురుపై రూమర్లు తీవ్ర స్థాయి కి వచ్చేశాయి. నా అమ్మాయిలు ఇద్దరికీ నేను ముందే చెప్పాను స్టార్ కిడ్స్ అన్నాక ఇలానే ఉంటుంది మీకు నచ్చిన నచ్చకపోయినా అర్ధం చేసుకొని ముందుకు వెళ్ళాళని. ఒకసారి మాత్రం నాకు బాధ అనిపించింది. ఒక పార్టీలో నా పెద్ద కూతురు ఝాన్వి హీరో రణబీర్ కపూర్ వెంట పడుతుంది అని రాశారు. అందులో ఒక్క శాతం కూడా నిజం లేదు అక్కడ జరిగింది వేరు వాళ్ళు రాసింది వేరు. అప్పుడు మా అమ్మాయితో చెప్పాను ఇలాంటి అనుభవాలు ఎదురువుతూ ఉంటాయి. అది కూడా ఒకందుకు మంచిదే ఎందుకంటే మంచే కాదు చెడు కూడా ఉంటుంది అని తెలుస్తుంది కదా'' అంటోంది శ్రీదేవి.
నిజానికి కరణ్ జోహార్ ఈ పిల్లను లాంచ్ చేస్తాడని అనుకున్నా కూడా.. ఎందుకో శ్రీదేవి మాత్రం రకరకాలు ఇతర ఆప్షన్లు వెతుకుతోంది. ఈమె చాలా సినిమాలు వెతికీ వెతికీ చివరకు 'మామ్' అనే ఫ్లాపు చేసినట్లు ఇప్పుడు కూతురుతో కూడా ఏదన్నా ఫ్లాపు సినిమాతో డెబ్యూ చేయిస్తుందో ఏంటో.