సుదీర్ బాబు హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'శ్రీదేవి సోడా సెంటర్' మంచి బజ్ తో ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని మీడియాల్లో కూడా ఈ చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేస్తూ ఉన్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాతల విజయ్ చిల్లా మరియు శశి మాట్లాడుతూ సినిమా పూర్తి అయ్యి ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనుకోలేదు. సినిమాకు వచ్చిన ఎన్నో అడ్డంకులు మరియు అవాంతరాలను ఎదుర్కొని ఇప్పుడు విడుదలకు సిద్దం అయ్యిందని వారు పేర్కొన్నారు.
నిర్మాతలు ఇంకా మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ ప్రారంభం అయిన రోజే తీసుకు వచ్చిన ఖరీదైన పెద్ద కెమెరా కింద పడి పగిలింది. దాంతో మొదటి రోజు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. అయినా కూడా షూటింగ్ ను కంటిన్యూ చేస్తూ ఉండగా.. ఒక రోజు అసిస్టెంట్ కు కార్ వాన్ వద్ద కరెంట్ షాక్ కొట్టింది. ఆ సమయంలో షూటింగ్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏదోలా షూటింగ్ మళ్లీ ప్రారంభించాం. ఒక సారి కార్ వాన్ గుంటలో ఇరుక్కు పోయి చాలా సమస్య అయ్యింది. ఈ సంఘటనలు అన్ని కూడా చెడు శకునాలుగా అనిపించినా కూడా షూటింగ్ ను ముందుకు తీసుకు వెళ్లాం.
షూటింగ్ సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో మళ్లీ ఒక సమస్య వచ్చింది. అదే మా కుటుంబంలో ఒకరు చనిపోవడం. దాంతో నెల రోజుల పాటు షూటింగ్ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత నుండి ఎలాంటి అవాంతరాలు లేకుండా సినిమా పూర్తి అయ్యి మంచి బజ్ తో విడుదలకు సిద్దం అయ్యింది. సినిమా ను ఒకానొక సమయంలో పూర్తి చేయడం అసాధ్యం అనుకున్నాం. కాని యూనిట్ సభ్యుల పట్టుదలతో సినిమా షూటింగ్ ను ముగించాం. మంచి అంచనాల మద్య విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ నిర్మాతలు చెప్పుకొచ్చారు.
పలాస 1976 చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాతో మరోసారి కులం మరియు ప్రేమ కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కించాడు. సుదీర్ బాబు మాస్ లుక్ తో పాటు హీరోయిన్ మరియు ఇతర పాత్రలను చూస్తూ ఉంటే సినిమా చాలా నాచురల్ గా ఆకట్టుకునే విధంగా ఉంటుందేమో అంటూ ప్రేక్షకులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.