టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''శ్రీదేవి సోడా సెంటర్''. 'పలాస 1978' ఫేమ్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. టైటిల్ - ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం నుంచి వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన 'మందులోడా' మాస్ కా బాస్ సాంగ్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ''నాలో ఇన్నాళ్లుగా'' అనే సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేశారు.
'నాలో ఇన్నాళ్లుగా కనిపించని ఏదో ఇదీ.. లోలో కొన్నాళ్లుగా నాతో ఏదో అంటున్నదీ..' అంటూ సాగిన ఈ మెలోడీ గీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది. లైటింగ్ సూరిబాబు - సోడాల శ్రీదేవి పాత్రల్లో నటిస్తున్న సుధీర్ బాబు - ఆనంది ఒకరి మీద ఒకరికున్న భావాలను ఈ పాట రూపంలో వ్యక్తం చేసుకుంటున్నారు. ఇందులో హీరో హీరోయిన్ల హావభావాలు అలరిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇదొక కమర్షియల్ సినిమా అనుకునే విధంగా ప్రమోషనల్ కంటెంట్ వదిలిన మేకర్స్.. 'నాలో ఇన్నాళ్లుగా' పాటతో ఇందులో అందమైన ప్రేమ కథ కూడా ఉన్నట్లు చెప్పకనే చెప్పారు.
'నాలో ఇన్నాళ్లుగా' గీతానికి సంగీత బ్రహ్మ మణిశర్మ బాణీలు సమకూర్చారు. ప్రముఖ గేయ రచయిత సీతారామశాస్త్రి దీనికి సాహిత్యం అందించారు. దినకర్ - రమ్య బెహర కలిసి ఈ పాటను ఆలపించారు. ఈ చిత్రానికి శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఇందులో పావెల్ నవగీతన్ - నరేష్ - సత్యం రాజేష్ - రఘుబాబు - అజయ్ - హర్షవర్ధన్ - సప్తగిరి - రోహిణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. 'శ్రీదేవి సోడా సెంటర్' చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై విజయ్ చిల్లా - శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Full View