శ్రీకాంత్ సినిమాలో జెర్మన్ షెపర్డ్స్

Update: 2017-08-08 10:29 GMT
ఒకప్పుడు తనదైన శైలిలో సినిమాలను తెరకెక్కించి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీకాంత్ ప్రస్తుతం హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలను చేస్తున్నాడు. వస్తున్నవి చిన్న పాత్రలు అయినా సరే ఆ పాత్రకు న్యాయం చేస్తూ.. అలరిస్తున్నాడు. అంతే కాకుండా కుదిరినప్పుడు హీరోగాను ట్రై చేస్తూ పరవాలేదనిపిస్తున్నాడు. ఎన్నో ప్రయోగాత్మకమైన చిత్రాలతో అలరించిన శ్రీకాంత్ ఇప్పుడు మరో కొత్త తరహా చిత్రంతో రాబోతున్నాడు.

1985"తేరి మెహేర్బనియన్" చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఓ చిత్రాన్ని త్వరలో స్టార్ట్ చేస్తున్నాడు. కే.సి బొకాడియా ఈ సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నాడు. ఒకేసారి తెలుగు-తమిళ్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్  సరసన నికిషా పటేల్ హీరయిన్ గా నటిస్తోంది. అప్పట్లో హిందీలో సూపర్ హిట్ అయినా తేరి మెహేర్బనియన్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. ఆ చిత్రంలో మోతీ అనే కుక్క పాత్ర చాలా కట్టుకుంటుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న చిత్రంలో రెండు జెర్మన్ షెపర్డ్ శునకాలు అలరించనున్నాయట. అందుకోసం లండన్ నుంచి ఆ తరహా  శునకాలను పర్యవేక్షకుల అధీనంలో తీసుకువచ్చి షూటింగ్ జరపనున్నారని తెలుస్తోంది.

ఇక శ్రీకాంత్ పోలీస్ పాత్రలో అలరించనుండగా హీరయిన్ ఆయన భార్య పాత్రలో నటించనుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే . పాత  "తేరి మెహేర్బనియన్" సినిమాను నిర్మించిన నిర్మాత ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అతనే కే.సి బొకాడియా. బాలీవుడ్ లో మంచి దర్శకుడిగా పేరుపొందిన ఈ దర్శకుడు ఎలా తెరకెక్కిస్తాడో చూడాలి.      
Tags:    

Similar News