శ్రీమంతుడు కూడా అదే పని...

Update: 2015-07-20 10:40 GMT
టికెట్ రేట్స్.. టాలీవుడ్ కు తలనొప్పిగా మారిన టాపిక్ ఇది. బాహుబలి రిలీజ్ టైములో టికెట్స్ ధరలను అఫీషియల్ గా పెంచడానికి ఒక జి.ఒ. కూడా విడుదల చేయించాలని చూసినట్లు టాక్ వచ్చింది. అయితే ఆ టాక్ ను పక్కనేట్టేస్తే ఇప్పుడు థియేటర్ దగ్గర చెప్పకుండానే టికెట్ రేట్ ను డబల్ చేసి అమ్ముతున్నారు. కొంతమంది ఇదంతా దిల్ రాజు వలనే అంటూ ఆరోపించారు కూడా. అయినాసరే బ్లాకు మార్కెట్ ఈ ఆరోపణలు వగైరా పట్టించుకోకుండా తన పని తానూ చేస్కుపోతోంది.

లేటెస్ట్ద అప్ డేట్ ఏంటంటే మొదటి వారంలోనే వీలైనంత ఎక్కువ రాబట్టాలని చేసే ప్రయత్నం తాజాగా మహేష్  శ్రీమంతుడు కూడా ఈ బాహుబలి రూట్ లోనే వెళ్ళేలా ఉన్నాడు.  అభిమానుల సొమ్ముని పీల్చడానికి వాళ్ళని పిప్పి చేయడానికి ఇటీవల బాహుబలితో  ఎలాంటి స్కెచ్ వేసారో ఇప్పుడు కొందరు దిస్త్రిబుటర్స్ సేమ్ ఫార్ములా శ్రీమంతుడు కోసం తయారుచేసారట.. అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ప్రేక్షకుల అభిమానాన్ని నిలువునా దోచుకుంది  బాహుబలి అని కొందరు ఆరోపిస్తుంటే అదే లిస్టు లోకి శ్రీమంతుడు కూడా వెళ్తాడా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీమంతుడు టికెట్ రేట్ల ని అనధికారికంగా పెంచి వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ సొమ్ము రాబట్టుకోవడానికి ప్లాన్ సిద్దం చేసారని టాక్. మొదటి వారం ఎక్కువగా ఎగబడేది అభిమానులే కాబట్టి వాళ్ళు ఎంత రేటు పెట్టి టికెట్లు కొనడానికైనా రెడీ కాబట్టి వాళ్ళని టార్గెట్ చేస్తారట. బాహుబలి కి పెట్టారు కాబట్టి మాకు పెడతారు అని వీళ్ళ ఫీలింగ్. మరి గవర్నమెంట్ ఎం ఏం చేస్తున్నట్లో.. టికెట్ 500 అంటే టూ మచ్ బాబా.. 
Tags:    

Similar News