మహేష్ కొత్త సినిమా ‘శ్రీమంతుడు’ టైటిల్ మారింది. ఇంకో రెండు వారాల్లో సినిమా విడుదల కాబోతుండగా ఈ టైటిల్ మార్చడమేంటి అనుకోకండి. ఈ మార్పు తమిళ వెర్షన్ కోసం. శ్రీమంతుడు అనేది అచ్చ తెలుగు టైటిల్ కదా. బాహుబలి టైపులో అదో పేరైతే తమిళంలో కూడా అదే పేరుతో రిలీజ్ చేయచ్చు. అందుకే తమిళ వెర్షన్ కు పేరు మార్చారు. టైటిల్.. సెల్వందన్. అంటే శ్రీమంతుడనే అర్థం. బాహుబలి ఇచ్చిన ఊపుతో ‘శ్రీమంతుడు’ కూడా తమిళంలో భారీ స్థాయిలోనే విడుదలవుతోంది. మహేష్ సినిమాల్లో తమిళనాట అత్యంత భారీగా విడుదలవుతున్న సినిమా ఇది.
ఇంతకుముందు ‘బిజినెస్ మేన్’ సినిమాను కూడా తమిళంలోకి డబ్ చేసి.. పెద్ద ఎత్తునే రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమా తమిళ ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకులేదు. ఆ తర్వాత మహేష్ సినిమాలేవీ తమిళంలోకి వెళ్లలేదు. ఐతే మిగతా హీరోలందరూ నెమ్మదిగా మార్కెట్ పెంచుకుంటున్న నేపథ్యంలో మహేష్ కూడా తమిళం మీద దృష్టిపెట్టాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినపుడే తెలుగుతో పాటు తమిళ డబ్బింగ్ వెర్షన్ ను కూడా ఒకేసారి విడుదల చేస్తామని ప్రకటించారు. అందుకే తగ్గట్లే ఏర్పాట్లు చేశారు. శ్రుతి హాసన్ హీరోయిన్ కావడం కూడా కలిసొచ్చింది. ఆగస్టు 7న తమిళ సినిమాల స్థాయిలోనే భారీగా ‘శ్రీమంతుడు’ విడుదల చేయబోతున్నారు. సినిమా బాగుంటే తమిళంలో మహేష్ కు మంచి మార్కెట్ రావడం ఖాయం.