మహేష్ పాటల పండగకి ఫిల్మ్‌నగర్ ముస్తాబవుతోంది. అభిమానులంతా 18వ తేదీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వాళ్లను ముందస్తుగానే ఉత్సాహపరిచేలా `శ్రీమంతుడు`లోని మహేష్ స్టిల్స్‌ని రోజుకొకటి చొప్పున వదులుతున్నారు. నిన్ననే సైకిల్‌పై వస్తున్నప్పటి మహేష్ ఫొటోని విడుదల చేశారు. అందులో మహేష్ మరింత అందంగా కనిపిస్తున్నాడు. తాజాగా పాటల ట్రాక్‌లిస్ట్‌ని కూడా విడుదల చేశారు. అందులో మొత్తంగా ఆరు పాటలున్నాయి. పాటలన్నింటినీ రామజోగయ్యశాస్త్రి రాయడం విశేషం.
`మిర్చి` ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన `శ్రీమంతుడు` చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ పనిచేశారు. `1` తర్వాత మహేష్ చిత్రానికి మరోసారి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. పాటలు దిమ్మతిరిగిపోయేలా ఉంటాయని చిత్రబృందం ఊరిస్తోంది. నిజంగానే ట్రాక్‌లో `దిమ్మతిరిగే...` అంటూ ఓ పాటని పెట్టారు. రామరామ, జతకలిసే, చారుశీల, శ్రీమంతుడా, జాగోతోపాటు దిమ్మతిరిగే... అంటూ మరో పాట ఉంది. దేవిశ్రీప్రసాద్ సినిమాలో ఒక్కటైనా ఊపొచ్చే పాట ఉంటుంది. `మిర్చి`లో మిర్చి మిర్చి... అంటూ ఓ ఐటెమ్‌ని వినిపించాడు దేవి. ఆ పాటని ఇప్పుడు కూడా పాడుకొంటున్నారు. మరి ఈ ఆల్బమ్‌లో అలా హుషారైన పాట ఏదో చూడాలి. చూస్తుంటే దిమ్మతిరిగే పాటే... హుషారైన పాటలా ఉంది. ఆల్బమ్ విడుదలైతే కానీ.. ఆ పాటల రుచి తెలిసే అవకాశం లేదు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.